ప్రశ్న: యాండ్రాయిడ్ మొబైల్స్ అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?
జవాబు: యాండ్రాయిడ్ (Android) అంటే ఆంగ్లభాష ప్రకారం ఓ మరమనిషి (Robot). కృత్రిమ పద్ధతిలో మనిషి చేసే విధంగా కొన్ని పనులను చేయగలిగే మరజంతువు, లేదా మరమనిషిని యాండ్రాయిడ్ అంటారు. అయితే మొబైల్స్ విషయంలో ఈ పదానికి ఓ భిన్నమైన అర్థం ఉంది. ఇక్కడ యాండ్రాయిడ్ అంటే ఓ కంప్యూటర్ పరిభాష. Windows, MAC, GNU, LINUX లాగా ఇది కూడా ఓ ఆపరేటింగ్ సిస్టమ్. దీన్ని గూగుల్ కంపెనీ రూపొందించింది. మరో మాటలో చెప్పాలంటే కంప్యూటర్లను నడిపేందుకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నట్టే, మొబైల్ ఫోన్ల ద్వారా కొన్ని పనులను చేయడానికి ఉపకరించే వ్యవస్థే ఇది. వేరే ఫోన్లలో ఉన్న యంత్రాంగం ద్వారా చేయలేని ఎన్నో పనులను యాండ్రాయిడ్ ఫోన్లు చేయగలవు. ఉదాహరణకు యాండ్రాయిడ్ ఫోనులాగా మిగిలిన ఫోన్లు సర్వర్‌లాగా పనిచేయలేవు. జీపీఆర్‌ఎస్ సాయంతో మామూలు ఫోన్లు ఇంటర్నెట్‌ను చూపగలిగినా, వాటిని సంధానించుకుని ఇతర ఫోన్లు వైఫై లేదా బ్లూటూత్ ద్వారా ఇంటర్నెట్‌ను చూడలేవు. కానీ యాండ్రాయిడ్ ఫోనుకు జీపీఆర్‌ఎస్ ఉంటే, దాని సాయంతో మిగిలిన సెల్‌ఫోన్లలో కూడా ఇంటర్నెట్ చూడవచ్చు.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్,--వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...