విడిపోయిన భారీ మంచుముక్కలే సముద్రంలో ఐస్‌బర్గ్‌లుగా మారతాయని తెలుసుగా? ఈ ఐస్‌బర్గ్ ఏకంగా హైదరాబాద్ నగరంకన్నా పెద్దగా ఉంటుంది! ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న అంటార్కిటికా .. ఐస్‌బర్గ్‌లలో అతిపెద్దదిగా రికార్డు కొట్టింది. దాదాపు 563 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నది . ఇది ఏకంగా 1640 అడుగుల మందంతో ఉంటుంది. నీటిపైన కనిపించేది మాత్రం 160 అడుగులే.
ఐస్‌బర్గ్‌ల గురించి తెలుసుకోవాలంటే ముందు హిమానీ నదుల (గ్లాషియర్స్) గురించి అర్థం చేసుకోవాలి. కొండల్లాంటి ఎత్తయిన ప్రదేశాల్లో ఏర్పడే మంచు నెమ్మదిగా గట్టిపడి ముందుకు జరుగుతూ ఉంటుంది. ఇలా ఇవి పల్లానికి జరుగుతూ నేలను కూడా కోతకు గురి చేస్తాయి. ఇవి కరిగినప్పుడు వీటి నుంచే నదులు ఏర్పడి కిందకి ప్రవహిస్తాయి. అలా 'పైన్ ఐలాండ్' అనే హిమానీ నది నుంచి ఈ ఐస్‌బర్గ్ విడివడనుందన్నమాట. శాస్త్రవేత్తలు దీన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకో తెలుసా? ఐస్‌బర్గ్ ఏర్పడే ప్రక్రియ తొలిసారిగా శాస్త్రవేత్తల కంటపడింది. దీన్ని ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీసి గమనిస్తున్నారు. వాతావరణంలో ఏర్పడే కొన్ని మార్పుల గురించి కూడా తెలుసుకోవచ్చని అంటున్నారు.
లక్షలాది టన్నుల బరువుండే ఐస్‌బర్గ్‌లు తేలుతూ సముద్రంలో ప్రయాణిస్తుంటాయి. ఉష్ణోగ్రతలు పెరగ్గానే ఇవి చిన్న ముక్కలుగా విడిపోయి సముద్రంలో కలిసిపోతాయి. ఐస్‌బర్గ్‌ల వల్ల ఓడలకు ప్రమాదమే. టైటానిక్ ఓడ ఐస్‌బర్గ్‌ను ఢీకొట్టే మునిగిపోయిందని తెలుసుగా?
ఇన్నాళ్లూ బి-15 అనే ఐస్‌బర్గ్‌కు అతిపెద్దదిగా రికార్డు ఉంది. 2001లో ఏర్పడిన ఇది(అంటార్కిటికా) ఏకంగా 295 కిలోమీటర్ల పొడవు, 37 కిలోమీటర్ల వెడల్పు ఉండేది. ఇక దీని బరువు 300 బిలియన్ టన్నులుగా అంచనా వేశారు. కొన్నేళ్లకు ఇది ముక్కలైపోయింది.
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...