- --
ప్ర : గోరింటాకు ఎలా పండుతుంది ?
జ : తోరింటాకు అరచేతులు , అరికాళ్ళు మీద పండినంత ఎర్రగా మిగిలిన శరీర భాగాలమీద పండకపోవడం గమనించే ఉంటారు . అసలు ఈ ఆకుల వల్ల మన చర్మం మీద ఎర్రగా ఎలా పండుతుంది అనుకుంటున్నారా?? ఆకులోని లాసోన్ అనే పదార్ధం చర్మంలోని స్త్రామ్ కార్నియం పొరలోని మృతకణాల ద్వారా లోపలకు ఇంకి చర్మానికి ఎరుపు రంగునిస్తుంది. లాసిన్‌తో పాటు మేనైట్ యాసిడ్, మ్యుసిలేజ్, గాలిక్ యాసిడ్, నాఫ్టాక్వినొన్ లాంటి రసాయనాలు కూడా ఇందులో ఉండడం వల్ల ఇది మంచి కలర్ డైగా వాడుకలో ఉంది. మన శరీరము వెలుపల ఉండే కెరోటిన్ కి అంటుకునే గుణము ఈ గోరింటాకుకు ఉంది . మన శరీరములోని వెంట్రుకలు , గోళ్ళు , అరచేతులు , అరికాళ్ళు భాగాలలో కెరోటిన్ ప్రోటీన్ అధికము . అందుకే ఆభాగాలకు బాగా పట్టి పండుతుంది .
మన దేశంలో పెళ్లికి, గోరింటాకుకు విడదీయలేని అనుబంధం ఉంది అని చెప్పవచ్చు. పెళ్లి లేని గోరింటాకు ఉండవచ్చునేమో కాని గోరింటాకు లేని పెళ్లి సందడి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఉత్తర భారతీయులైతే పెళ్లికి ముందు మెహెంది అని గోరింటాకు పెట్టుకోవడానికే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అబ్బాయి తరఫునుండి వచ్చిన గోరింటాకుతో పెళ్లి కూతురుకు అందమైన దిజైన్లు దిద్దుతారు. కొన్ని సంప్రదాయాలలో కొత్త పెళ్లి కూతురి చేతి గోరింటాకు వదిలేవరకు వంటింట్లోకి రాకూడదని అంటారు. అమ్మాయిని అంత అపురూపంగా చూసుకుంటారన్నమాట.
గోరింటాకు రంగు మార్చాలంటే దానిలో కాఫీపొడి లేదా టీ డికాక్షన్ వంటివి కలుపుతారు . మన శరీరము లో చర్మములోని కెరోటిన్ తోనే గోరింటాకు రియాక్ట్ అవడము చేత ... కాలంతో కెరటిన్ మృతకణాలు రాలిపోతాయి . దానితో పాటే గోరింటాకు రంగూపోతుంది. అందుకే గోరింటాకు పెట్టుకున్న తరువాత కొద్దిరోజులే ఆ రంగు ఉంటుంది .
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...