ప్రశ్న: టైర్లు నల్ల రంగులోనే ఉంటాయెందుకు?
1.జవాబు: టైర్లు ప్రధానంగా రబ్బరుతో తయారవుతాయి. ఈ రబ్బర్ల తయారీలో సాధారణంగా బొగ్గు చూర్ణాన్ని(charcoal powder) కలుపుతారు. ఇందువల్ల రబ్బరుకు మరీ ఎక్కువ స్థితిస్థాపకత(elasticity) లేకుండా ఉండడంతో పాటు, టైర్లకు గట్టిదనం కూడా ఏర్పడుతుంది. తాకిడిని తట్టుకునేంత సస్పెన్షన్‌ను ఇస్తుంది. దీని వల్లనే టైర్లకు నల్ల రంగు ఏర్పడుతుంది. టైర్లను కాల్చినపుడు దట్టమైన పొగ రావడానికి కారణం కూడా సరిగా మండని ఈ కర్బన రేణువులే.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య,--నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
------------------------------------------
2.జవాబు: సైకిలుకు కానీ, కారుకు కానీ, మరే ఇతర వాహనానికైనా ఉండే టైర్లకు కొన్ని ముఖ్యమైన ధర్మాలు ఉండాలి. వాహనం ఎంత వేగంగా వెళుతున్నా టైరులో ఉండే ట్యూబులో గాలి తగ్గిపోకుండా ఉండాలి. రోడ్డుపై పోతున్నప్పుడు కలిగే రాపిడి (friction)కి తట్టుకోగలిగే శక్తి ఉండాలి. ఎక్కువ కాలం మన్నేటంత దృఢత్వం ఉండాలి. మామూలు రబ్బరులో ఈ లక్షణాలన్నీ ఉండవు. అందుకని టైర్ల తయారీకి మామూలు రబ్బరులో కొన్ని ఇతర పదార్థాలను కలుపుతారు. రబ్బరులో 35 శాతం 'బ్యూటజీన్' రబ్బరును కలుపుతారు. ఇది టైర్లకు రాపిడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. మరో 65 శాతం 'కార్బన్ బ్లాక్' అనే పదార్థాన్ని కలుపుతారు. ఇది టైర్లను దృఢంగా ఉండేలా చేస్తుంది. వీటితో పాటు ఇంకా ప్రాసెసింగ్ ఆయిల్, ప్రొడక్షన్ వ్యాక్స్ తదితర పదార్థాలను కూడా కలిపి టైర్లను తయారు చేస్తారు. టైర్లలో ఎక్కువగా ఉండే కార్బన్‌బ్లాక్ అనేది ఇసుక నుంచి తయారయ్యే నల్లని పదార్థం. దీని వల్లనే టైర్లకు నల్లని రంగు వస్తుంది. ఇలా తయారైన టైర్లు అరిగిపోకుండా సుమారు లక్షాయాభైవేల కిలోమీటర్లు నడుస్తాయి.
- ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...