ప్ర : శ్రావణ మాసం పూర్ణిమను రాఖీ పూర్ణిమ అని ఆచారములోమి ఎలా వచ్చింది?
జ : శ్రావణ పూర్ణిమ విద్యారంభకాలమని పండితుల అభిప్రాయము . అంటే పూర్వము ఈ రోజున వేదాద్యయనము ప్రారంభించేవారు . దీనికి ముందు యజ్ఞోపవీతధారణ చేయడం మన ఆచారము . యజ్ఞోపవీతాన్నే జంధ్యం అనడం వల్ల ఈ రోజుకి జంధ్యాల పూర్ణిమ అని పేరు వచ్చింది . ఈ పండుగకు పురాణసంబంధమైన ఆచారము కనిపించదు . దీనినే రాఖీ పూర్ణిమ , నార్లీ పున్నమి అనీ అంటారు .
గుజరాత్ కు చెందిన బ్రాహ్మణులు తమ పోషకుల్ని ఈ రోజున సందర్శించి వారి ముంజేతికి రాఖీ కట్టే వారు . వారి నుండి కానుకలు పొందేవారు . రాఖీ అంటే తోరం అని అర్ధము .. . . అందుకే రాఖీ పూర్ణిమ అని పేరొచ్చినది . పట్టు లేదా నూలు దారముతో చేసిన రాఖీకి రకరకాల పూలు , డిజైన్ల బిల్లలు జతచేసి కుడి మణికట్టుకు ముడివేస్తారు .
ఇంకో కదనము ప్రకారము యుద్ధము లో జయము పొందాలని దేవగురువు సలహామేరకు ఇంద్రుని భార్య సతీదేవి భర్తకు శక్తిమయమైన రాఖీని శ్రావణపౌర్ణమి నాడు రక్షణకోసము కట్టడము జరిగినది . రాక్షసులపై ఇంద్రుని విజము పొందడముతో అదొక ఆచారముగా దేవ , దానవ , మానవులలో జరుపుతూ ఉన్నారు . కాలక్రమేణా మానములలో అన్నలు , తమ్ముళ్ళ నుంచి రక్షణ కోరుతూ తమ అనుబంధానికి గుర్తుగా అక్క చెళ్ళెల్లు కట్టే తోరణము గా మారినది . ఓ పెద్ద పండగగా వెలుగొందుతోంది . నేటి సమాజము లో స్నేహితులుగా ఉండే పేమికులలో స్త్రీలు తమవిముఖతను తెలియజేసేందుకు ప్రియునికి రాఖీ కట్టే ఒక మహత్తర మంత్రము గా మారినది .
- ===============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...