ప్రశ్న: గాలిలో కన్నా శబ్దవేగం నీటిలో ఎక్కువా? గాల్లో కన్నా నీటిలో స్పష్టంగా వినడానికి కారణం ఏమిటి?
జవాబు: శబ్దం ప్రయాణించాలంటే ఒక యానకం(medium) కావాలని చదువుకుని ఉంటారు. గాలిలోనే శబ్దానికి అత్యంత తక్కువ వేగం ఉంటుంది. గంటకు సుమారు 1240 కిలోమీటర్ల వేగంతో ధ్వని గాలిలో ప్రయాణిస్తుంది. ఒక యానకంలో ఉండే పదార్థ కణాలలో ఏర్పడే సంపీడనాలు (compressions), విరళీకరణాలు (rarifications) పరంపరంగా ధ్వని ప్రయాణం సాగుతుంది. యానకాల సాంద్రత, స్థితిస్థాపకత, సంపీడన గుణకం, ఉష్ణోగ్రత లాంటి ఎన్నో ధర్మాలు ధ్వని వేగాన్ని నిర్దేశిస్తూ ఉంటాయి. గాలిలో కన్నా నీటిలో ధ్వని సుమారు నాలుగున్నర రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. లోహాలలో అయితే ఈ వేగం సుమారు 15 రెట్లు అధికంగా ఉంటుంది. ఈ వేగం వల్లనే నీటిలోను, లోహాల్లోను ఎక్కువ దూరం వరకు ధ్వని తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. అందువల్లే నీటిలో ధ్వని స్పష్టత కూడా అధికంగా ఉంటుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య,నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...