ప్ర : ప్రేమ అంటే ఏమిటి?
జ : ప్రేమ అంటే ఒక తియ్యని అనుభూతి అని ప్రేమికులు చెబుతారు....
ప్రేమ అంటే ఒక మాయ, ఉచ్చు అని ప్రేమను ద్వేషించేవారు అంటుంటారు...
ప్రేమ అంటే డబ్బు లేని అమ్మాయి, డబ్బున్న అబ్బాయిని ప్రేమించడం లేదా డబ్బు లేని అబ్బాయి, డబ్బు ఉన్న అమ్మాయిని ప్రేమించడం అని కొంతమంది అభిప్రాయం.
ఈ ప్రేమ అనేది యవ్వనంలో కలిగే ఆకర్షణ, మోహం అని ఎవరికి తోచినట్లు వారు అభివర్ణిస్తారు.
కాని ... ప్రేమలో ఎన్నోరకాలు ఉన్నాయి.
కామముతో కూడుకున్న ప్రేమ ,
అవసరముతో కూడుకున్న ప్రేమ ,
ఆకలి తో కూడుకున్న ప్రేమ ,
స్వార్ధముతో కూడుకున్న ప్రేమ ,
భక్తితో కూడుకున్న ప్రేమ ,
అమ్మ నాన్నలు తమ పిల్లలను ప్రేమించేదే నిస్వార్ధ ప్రేమ ...
నిస్వార్ధ ప్రేమ హృదయాంతరాళలోని చిన్న జ్యోతి ... అది ఆరిపోకుండా కాపాడుకోవడమే జీవన సార్ధకత.
- =============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...