ప్రశ్న:హెడ్‌సిట్ వాడితే ఏమైనా నష్టాలు ఉన్నాయా?
జవాబు: సాధారణంగా సెల్‌ఫోను, టెలిఫోను, టీవీ కంప్యూటర్లలో వచ్చే శబ్దాలను వినడానికి చెవులకు అమర్చుకునే ఎలక్ట్రానిక్ పరికరాన్ని హెడ్‌సిట్ అంటారు. ఇవి వైర్ల అనుసంధానంతో ఉండే తంత్రీ, లేదా నిస్తంత్రీ (వైర్‌లెస్) పద్ధతుల్లో పనిచేసేలా రెండు రకాలుగా ఉంటాయి. తలమీద అటూ ఇటూ అమర్చుకునేలా ఉంటుంది కాబట్టి దీన్ని హెడ్‌సిట్ అంటున్నారు. తంత్రీ (కేబుల్డ్) పద్ధతిలో ధ్వని సంకేతాలు మోసుకొచ్చే హెడ్‌సిట్ పరికరాలు వాడడంలో పెద్దగా ప్రమాదాలు లేవు. ఎటొచ్చీ శబ్దపరిమాణం తగినంతగా ఉంటే చెవులకు మంచిది. ఇక నిస్తంత్రీ పద్ధతిలో వాడే పరికరాల్లో, ధ్వని స్థావరం నుంచి బలమైన రేడియో తరంగాలు లేదా మైక్రోవేవ్ తరంగాల రూపంలో వచ్చే సంకేతాలను గ్రహించి, వాటిని ధ్వని తరంగాలుగా మార్చే ప్రక్రియ ఉంటుంది. అంటే అక్కడ ఒక సంక్లిష్ట ఎలక్ట్రానిక్ తతంగం జరుగుతుందన్నమాట. తలకు అంత చేరువలో విద్యుదయస్కాంత తరంగాల ప్రక్రియ ఉండడం ఏమంత మంచి విషయం కాదు. తక్కువ సేపు అవసరానికి సరిపడా వాడితే పరవాలేదు కానీ గంటల తరబడి బ్లూటూత్ లేదా మైక్రోవేవ్ తరంగాల ప్రక్రియ సాగే పరికరాల వాడకాన్ని తగ్గించడమే మంచిది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్,-వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- =========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...