ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
ప్ర : కుటుంబానికి ఆడదే ఆదారం అంటారెందుకు?.
జ : అందమైన జీవితానికి , ఆరోగ్య్కరమైన సమాజానికి చక్కటి కుటుంబమే మూలము . మనకు , మనము ఉన్న సమాజానికి ఇంకా చెప్పాలంటే ప్రపంచానికీ కుటుంబమే పునాది. మన విజయాలకు , అపజయాలకు , ఆనందాలకు ఆధారము ఇల్లే . ... . కుటుంబమే . కుటుంబము సవ్యముగా వుంటే మన జీవితాలు ఆనందము గా ఉంటాయి. కుటుంబ వ్యవస్థ సవ్యముగా పనిచేయాలంటె ఆ ఇంటిని నడిపే భార్యాభర్తల వైవాహిక బంధము పటిస్ఠంగా ఉండాలి .
కుటుంబము పట్ల , కుటుంబసభ్యులపట్ల భార్యాభర్తలు ప్రదర్శించే బాధ్యతాయుతమైన దృక్పధము , సంసార రధము సజావుగా సాగడానికి కీలకమైన ఇరుసు అవుతుంది . భర్త కుటుంబానికి యజమాని అయితే భార్య సంసారాన్ని నేర్పుగా , ఒర్పుగా నడిపే సారధి . కుటుంబానికి ఆమె చుక్కాని. భర్త జీవతములోనే గాక ఆ కుటుంబములొనూ ఆమెదే ప్రముఖప్రాత్ర . భర్త ధర్మ కర్యాచరణకు , గౌరవమర్యాదలు పొందడానికి , వంశభివృద్ధికీ ఆమె కేంద్రబిందువు . ఇన్ని ప్రాధాన్యతల దృష్ట్యా , శాస్త్రరీత్యా భార్యనే ఇంటికి యజమానురాలని చెప్పవచ్చు.ఆదారమనీ చెప్పవచ్చు . కుటుంబ బాధ్యతల్ని , భర్త , పిల్లలు , అత్తమామలు , ఆడపడుచులు , మరుదులు, తోటికోడళ్ళు , పనివాళ్ళు వీళ్ళందరి మంచిచెడులను బాగోగులను ఆమే చూసుకోవాలి . ఇంటికి వచ్చే బంధుజనాన్ని ఆదరించాలి. భర్త సంపాదించిన సొమ్మును జాగ్రత్తచేయాలి. కుటంబసభ్యుల అవసరాలకనుగుంఅంగా ఖర్చుచేయాలి. కొంత సొమ్మును భవిష్యత్ అవసరాలకోసం జాగ్రత్త చేయాలి .
మానవ సంబంధాలలోకిల్లా ఉన్నతమైనది వైవాహిక బంధము. కడదాకా నిలిచేది ... నిలుపుకోవలసినదీ దాంపత్యబంధమే . ప్రపంచీకరణ ఫలితముగా కుటుంబ స్వరూపస్వభావాలు మారుతున్న నేపధ్యములో కూడా మిగతా దేశాలతో పోల్చితే భారతీయ దాంపత్య వ్యవస్థ ఎంతో పటిష్ఠముగా వుండి సామాజిక విలువలకు , కట్టుబాట్లకు ప్రాధాన్యతనిస్తూ తన ఉనికిని నిలుపుకుంటూ వస్తుంది. పెళ్ళితోనే భార్యాభర్తల సంసారబంధము మొదలవుతుంది. ప్రేమ , అవగాహన , నమ్మకము , స్నేహము , అనురాగము అన్నీ ఈ బంధములోనే ఉన్నాయి. దాంపత్యము అంటే పరస్పర ఆధారిత బంధము. జీవితభాగస్వామి అంటే అన్నింటా పరస్పరం పాలుపంచుమునే వారే కాని ప్రతిదీ భారంగా భావించేవారు , ఒకరి భారాన్ని మరొకరిపై మోపేవారూ కాదు . ఇద్దరు భారాన్ని సమముగా పంచుకునేవారే.
స్నేహము , సాన్నిహిత్యము , సాన్నిధ్యము , సహాయత , ప్రేమైక భావన , భద్రత , రక్షణ , పరస్పర ఆలంబన , శృంగారము కలబోసుకున్న అన్యోన్యానురాగబంధములోని ఆనందమే అర్ధనారీశ్వర తత్వము. అదే ఆలుమగలు కలసి రాసే పెళ్ళి పుస్తము లోని సారాంశము. అందుకే అన్నారు కుటుంబానికి ఆడదే ఆదారము అని .
=========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
your comment is important to improve this blog...