రంగు రంగుల టీషర్ట్స్ వేసుకొని షోగ్గా తిరగాలని మనందరికీ చాలా సరదా. మామూలు చొక్కాల కన్నా టీ-షర్ట్స్ చాలా ఫ్యాషన్‌గా ఉంటాయి. సౌకర్యంగా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారయ్యాయి?
టీ షర్ట్ గురించి తెలుసుకోవాలంటే మొదటి ప్రపంచ యుద్ధకాలానికి వెళ్ళాలి. అప్పట్లో యూరోపియన్లు టీ-షర్ట్స్ వంటి లోదుస్తులను ధరించి యుద్ధం చేస్తుంటే అమెరికన్లు మాత్రం దళసరి యూనిఫాంలు ధరించి యుద్ధం చేసేవారు. కాని యూరోపియన్లు హాయిగా ఉంటే అమెరికన్లు చెమటలు కక్కుతూ ఉండేవారు. దాంతో కొన్నాళ్ళకు అమెరికన్లు కూడా టీ-షర్ట్స్ వైపే మొగ్గు చూపారు. దాంతో ఒక్కసారిగా టీ-షర్ట్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. చూడ్డానికి ఇంగ్లీషు 'టీ' ఆకారంలో ఉంటుంది. కనుక వీటికి టీ-షర్ట్స్ అనే పేరు వచ్చింది. 1960 నుంచి వీటి మీద డిజైన్లు, బొమ్మలు ముద్రించడం లేదంటే స్లోగన్స్ రాయడం మొదలయ్యాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం. కొన్ని ఉద్యమాలప్పుడు అందరూ టీ-షర్ట్స్ మీద నినాదాలు రాసుకొని తిరుగుతుంటారు. అలా ఇవి ప్రచారానికి కూడా ఉపయోగపడే సాధనాలయ్యాయి. మాజీ అమెరికా ప్రధాని క్లింటన్‌కు టీ-షర్ట్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఆయన ధరించే అత్యుత్తమ నాణ్యత కలిగిన టీ-షర్ట్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? మన హైదరాబాద్‌లో.
ఇప్పుడు తెలిసిందా రోజూ మనం వేసుకునే టీ-షర్ట్స్ ఎలా వెలుగులోకి వచ్చాయో. మాజీ అమెరికా ప్రధాని క్లింటన్‌కు నచ్చే టీ-షర్ట్స్ మన హైదరాబాద్ నుంచి తయారవుతున్నాయంటే మన కెంతో గర్వకారణం కదా. ఎవరైనా అడిగితే మనం ఠక్కున చెప్పవచ్చు.
- ================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...