ప్రశ్న:
మనుషులు పుట్టిన కొన్ని ఏళ్ల తర్వాతే మాట్లాడుతారు. పుట్టగానే మాటలు ఎందుకు రావు?
జవాబు:
శబ్దం చేయడమనేది జీవి విశిష్టతకు సంబంధించిన అంశం. పరిణామ క్రమంలో వివిధ రకాల జంతువులు రకరకాలుగా శబ్దాలను చేయగలుగుతున్నాయి. అయితే శబ్దాలకు క్రమబద్ధతను కల్పించి క్రమేపీ భాషను నెలకొల్పడం మానవ జాతికే వీలయింది. అందువల్ల భాష సామాజిక పరిణామంతో ముడిపడింది. మాట్లాడాలంటే వినాలి. అయితే పుట్టక మునుపు తల్లి మాట్లాడే భాషకానీ, ఆ శబ్దాలు ప్రసారమయ్యే వాతావరణంగానీ శిశువుకి పరిచయం కావు. పుట్టగానే శ్వాస పీల్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నమే కేర్‌మనే ఏడుపు శబ్దం. అంతకు మించిన శబ్దాలకు శిశువు నోటిలోని భాగాలు కూడా అభివృద్ధి చెంది ఉండవు. ఎందుకంటే మాటలు పలకడానికి నోటిలోని దంతాలు, నాలుక, గొంతు కండరాలు, పెదాలు సమన్వయంతో పనిచేయాలి. ఈ సామర్థ్యం శిశువు పెరుగుతున్న కొద్దీ అలవడుతుంది. తల్లి మాటలు వింటూ పదాలు, వాక్యాలు, అక్షరాలు, శబ్దాలు గ్రహిస్తూ ఆపై లిపిని కూడా మనిషి పరిచయం చేసుకుంటాడు. భాష సామాజిక పరమైనది కాబట్టే కొన్ని భాషలు, భాషల్లోని కొన్ని పదాలు కనుమరుగవుతున్నాయి.
- =============================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...