MRI స్కానర్ ఎలా పని చేస్తుంది?
- ఎమ్. అరుణ్‌కుమార్, ఇంటర్, ఇచ్ఛాపురం
జవాబు:
MRI 'మాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్' అనే ఆంగ్ల పదాలకు సంక్షిప్త పదం. తెలుగులో 'అయస్కాంత అనునాద ప్రతిబింబ కల్పన' అని చెప్పుకోవచ్చు.
భౌతిక శాస్త్ర సూత్రమైన అయస్కాంత అనునాదాన్ని అనుసరించి మనం కంటితో చూడలేని శరీర భాగాల ప్రతిబింబాలను కంప్యూటర్ తెరపై చిత్రించే పరికరాన్నే ఎమ్మారై స్కానర్ అంటారు.
సొరంగంలాగా ఉండే MRI స్కానర్ భాగంలోకి ప్రేవేశపెట్టిన వ్యక్తి శరీరం ఆ పరికరంలో ఉండే అతి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రానికి గురవుతుంది. ఫలితంగా శరీరంలోని అణువులలో ఉండే కణాలు ఒక వరస క్రమంలోకి వస్తాయి. ఆ తర్వాత అక్కడే ఉత్పన్నమయ్యే రేడియో తరంగ స్పందనలు ఆ కణాలను అవి ఉండే క్రమం నుంచి చెదరగొడతాయి. మళ్లీ ఆ కణాలు వాటి తొలి స్థానాలకు వచ్చే క్రమంలో రేడియో సంకేతాల్ని ఉత్పన్నం చేస్తాయి. ఆ సంకేతాలను స్కానర్‌కు అనుసంధానించిన కంప్యూటర్ విశ్లేషిస్తుంది. ఆపై కంప్యూటర్ తెరపై దేహంలోని ధాతువు (కణజాలాల) యొక్క ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఆ ప్రతిబింబం నుంచి ఆ ధాతువు (దేహభాగం) యొక్క నిర్మాణాత్మక, జీవరసాయన సమాచారాన్ని, లోపాల్ని తెలుసుకుంటారు.
- ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్
- ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.
No comments:
Post a Comment
your comment is important to improve this blog...