Sunday, July 18, 2010

Does poultry eggs give chicks on hatching?, ఫారం కోడిగుడ్లను పొదిగితే పిల్లలవుతాయా?




ప్రశ్న: కంపెనీ కోడి గుడ్లను ఫారం కోళ్లు పొదగవు. ఆ గుడ్లను నాటు కోడిచేత పొదిగించినా పిల్లలు రావు. మరి వాటిని పొదిగేదెలా?
ప్రశ్న: నాటుకోడి పెట్టిన గుడ్లను పొదిగితే పిల్లలవుతాయి. మరి ఫారం కోడిగుడ్లను పొదిగితే కూడా పిల్లలవుతాయా?

జవాబు: నాటు కోడి ప్రకృతి సహజంగా పరిణామ క్రమంలో ఆవిర్భవించిన ఓ జీవి. ఇది ఒక సకశేరుక (vertebrate) పక్షివర్గపు (aves) జంతువు. ప్రకృతి సిద్ధంగా ప్రతి జీవి తన సంతానాన్ని తన జాతిని తరాల తరబడి ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే జీవుల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ (reproductive system) ఉంది. మామూలు నాటు కోడి ప్రకృతి సిద్ధమైనదే కానీ, ఫారం (poultry) కోడి అలాంటిది కాదు. జన్యు సాంకేతిక ప్రక్రియ (genetic engineering)ను, ప్రకృతి సిద్ధమైన పద్ధతులకు సంధానించగా ఏర్పడినది. అవి గర్భం నుంచే పుడతాయి కానీ వాటి గుడ్లను పొదిగితే పిల్లలు రావు. కారణం వీటి గుడ్లలో ఫలదీకరణం చెందిన అండం ఉండదు. ఆడ, మగ కోళ్లు జతగూడడం వల్ల కాకుండా ప్రత్యేక పద్ధతిలో సేకరించిన శుక్రద్రవాన్ని ఫారం కోడి పెట్టలకు ఇంజెక్ట్‌ చేస్తారు. అందువల్లనే వీటిలో జీవం ఉండదు. కేవలం తెల్ల సొన, పచ్చసొనలతో కూడిన ప్రొటీనే ఉంటుంది. అందుకే వీటిని కేవలం శాకాహారమనే అంటారు. మరి ఇలా ఎందుకు చేస్తారు? మామూలు కోడి గుడ్డును నిలవ ఉంచితే తినడానికి పనికిరాదు. అదే ఫారం కోడిగుడ్డయితే పరిమిత ఉష్ణోగ్రత వద్ద ఎంత కాలం నిలవ ఉంచినా ఏమీ కాదు.

- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్‌,-వరంగల్‌; రాష్ట్ర కమిటీ, జనవిజ్ఞానవేదిక

జవాబు: కంపెనీ (ఫారం) కోళ్లు పెట్టే గుడ్లలో జీవం ఉండదు. అయితే ఫారం కోడిపిల్లల్ని పత్యేక పద్ధతిలో మొదటి తరం గుడ్ల నుంచి సాధిస్తారు. అలా వచ్చిన తెల్లని కోడిపిల్లల్ని ఫారం హౌస్‌లలో తిండి పెట్టి బాగా పోషిస్తారు. వీటిని మాంసం కోసం, గుడ్ల కోసం వాడతారు. కోడిపుంజు ప్రమేయం లేకుండా సాంకేతికంగా ఉత్పత్తి చేసే ఈ గుడ్లలో ఫలదీకరణం జరగదు. పైగా ఆ గుడ్ల జన్యునిర్మాణాన్ని మార్చి సంతానాన్ని ఇవ్వని విధంగా నిర్దేశిస్తారు. కనుక వాటిని నాటుకోడి పొదిగినా, ఇంక్యుబేటర్‌లో పొదిగినా పిల్లలు రావు. అందుకనే ఫారం కోడిగుడ్లు శాకాహారంతో సమానమని చెబుతారు.



-ప్రొ||ఎ.రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక


================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...