చలికాలం రాగానే మూలనపడి వున్న స్వెటర్లను వెతుక్కొని మరీ వేసుకుంటాం. అవి ఎందుకు మనం వాడుతున్నాము, ఎలా తయారయ్యాయి అనేది మనం తెలుసుకుందాము.
ఆదిమానవుడు ఆధునికుడై కనిపెట్టినా అల్లిక సూదుల ద్వారా ఉన్ని వస్త్రాలను అల్లడం అతడు చాలా కాలం పాటు నేర్చుకోలేదు. మొదట ఈ పనిని మొదలెట్టింది అరబ్బులు. వాళ్ళే రాగితో అల్లిక సూదులను తయారు చేసి వాటితో సాక్సులు అల్లడం మొదలెట్టారు. ఆ తర్వాత 14వ శతాబ్దంలో ఈజిప్టు నుంచి యూరప్‌కు ఉలెన్ సాక్సులు చేరాయి. అక్కడి నుంచి యూరప్ అంతా ఉన్ని వస్త్రాల అల్లిక మొదలయ్యింది. బ్రిటీషువాళ్ళు ఉన్ని దుస్తులను ఎగుమతి చేసి డబ్బు సంపాదించడం కూడా మొదలెట్టారు. హాలెండ్, స్పెయిన్, జరనీ వంటి దేశాలలో అల్లిక బడులను తెరచి, పేదవాళ్ళకు పని కల్పించారు. స్కాట్‌ల్యాండ్‌లో ఈ పని కుటీర పరిశ్రమగా వర్ధిల్లింది. శీతాకాలంలో సైనికులు తొడగడానికి అనువుగా స్వెటర్లు, గ్లౌజులు తయారు చేయమని బ్రిటీషు రాణి ప్రజలను ప్రోత్సహించింది. పందొమ్మిదో శతాబ్దం తొలి నాళ్ళలో కూడా స్వెటర్లు, ఇతర ఉన్ని దుస్తులు సాధారణంగా సైనికుల దుస్తులుగా, శీతాకాలంలో ఉపయోగించే దుస్తులుగా వాడుకలో ఉండేవి. అయితే 1937 లో లానా టర్నర్ అనే హాలీవుడ్ తార 'దె డోంట్ ఫర్గెట్' అనే సినిమాలో టైట్ స్వెటర్ ధరించి కనిపించింది. అప్పటి నుంచి స్వెటర్లకు మంచి గ్లామర్ గాలి సోకింది. స్వెటర్ ఒక ఫ్యాషన్‌గా మారింది. స్వెటర్లు లేని చలికాలాన్ని ఊహించడం కష్టం. రంగురంగుల స్వెటర్లు మనల్ని కూడా రంగురంగుల పూలుగా మార్చేస్తాయి.
- ======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...