జవాబు: రిమోట్‌తో పనిచేసే టీవీ, డీవీడీ ప్లేయర్, కంప్యూటర్, ఏసీ లాంటి విద్యుత్ ఉపకరణాల విషయంలోనే దీన్ని పరిగణించాలి. ఎందుకంటే రిమోట్‌తో వీటిని ఆపేసినా వాటిలో ఎప్పుడూ ఓ విద్యుత్‌వలయం పనిచేస్తూ ఉంటుంది. పరికరం నిద్రాణ స్థితిలోకి వచ్చినా లోపల ఏదైనా చిన్న బల్బు (స్టాండ్‌బై) వెలుగుతూ ఉండే ఏర్పాటు ఉంటుంది. అప్పుడే తిరిగి రిమోట్‌తో దాన్ని ఆన్ చేయగలుగుతాం. కాబట్టి ఎంతో కొంత విద్యుత్ ఖర్చవుతూ ఉంటుంది. రిమోట్‌తో ఆపేసినా, ఆయా పరికరాలను కరెంటుతో అనుసంధానం చేసే స్విచ్‌లను కూడా ఆఫ్ చేస్తే ఇలా జరగదు. ఇలా చేసినప్పుడు ప్లగ్‌లు తీయనవసరం లేదు. అయితే ఎక్కువ సమయం వాడకపోయినా, పొరుగూరు బయల్దేరినా స్విచాఫ్ చేయడంతో పాటు ప్లగ్‌లు కూడా తీసేయడం మంచిది.
- =====================================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...