ప్రశ్న:
మరిగే నీళ్లు శరీరంపై పడితే బొబ్బలెందుకు వస్తాయి?
-జక్కా మన్మథ, జొన్నలపాడు
జవాబు:
ఒక వస్తువు వేడిగా ఉందంటే, దాని ఉష్ణోగ్రత మన శరీర ఉష్ణోగ్రత కన్నా ఎక్కువగా ఉందన్న మాట. ఉష్ణం ఎప్పుడూ ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రత వైపు పయనిస్తుంది. వేడిగా ఉన్న వస్తువును తాకినప్పుడు ఉష్ణం తక్కువ ఉష్ణోగ్రత ఉన్న మనదేహంలోకి ప్రవేశిస్తుంది. మన దేహం అనేక జీవకణాలతో నిర్మితమైంది. ఈ కణాలు అనేక అణువుల సముదాయం. సామాన్య దేహ ఉష్ణోగ్రత వద్ద ఈ అణువులు కదులుతూ ఉంటాయి. వేడి వస్తువు మన దేహంలోని ఏ భాగానికైనా తగిలితే, ఉష్ణశక్తి వలన ఆ వస్తువులో అతి వేగంగా చలిస్తున్న అణువులు మన దేహ భాగంలోని అణువులను కూడా అతి వేగంగా చలించేటట్లు చేస్తాయి. అందువల్ల మనదేహంలో ఆ భాగంలోని అణువులు దూరంగా వెళతాయి. కొన్ని సమయాల్లో అణువులు చర్మాన్ని వీడి పోతాయి. అప్పుడు కలిగే స్పర్శజ్ఞానమే కాలడం, బొబ్బలెక్కడం. ఆ విధంగా మరుగుతున్న నీళ్లు శరీరంపై పడితే బొబ్బలొస్తాయి.
- ప్రొ|| ఈ.వి. సుబ్బారావు, హైద్రాబాద్
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...