ప్రశ్న: స్కూలు బస్సులకు పసుపు రంగునే వేస్తారు. ఎందుకు?
జవాబు: స్కూలు బస్సుల రంగు నిమ్మకాయల వంటి స్వచ్ఛమైన పసుపూ కాదు, నారింజ లాంటి పసుపూ కాదు. ఈ రెండింటి మిశ్రమంగా పండిన మామిడి పండు రంగును పోలి ఉంటుంది.
మనం ఎంత దూరం నుంచైనా పసుపు రంగు వస్తువును కంటి మూలల నుంచి కూడా స్పష్టంగా గుర్తించగలం. ఇలా గుర్తించడంలో మనకు ఎరుపు రంగు కన్నా పసుపు విషయంలో 1.24 రెట్ల స్పష్టత ఉంటుంది. అలాగే మంచు పడుతున్న వాతావరణంలో కానీ, తెల్లవారు జామున, సాయం సమయాల్లో మసక చీకట్లో కానీ పసుపురంగును మిగతా వాటికన్నా బాగా చూడగలుగుతాం.
వర్ణదృష్టిలోపం ఉన్నవారికి రంగులు సరిగా కనపడవు. ముఖ్యంగా ఎరుపు రంగు అలాంటి వారికి నల్లగా, చీకటి రంగులో కనిపిస్తుంది. అదే పసుపు రంగు విషయంలో ఈ దృష్టి లోపం ఉండదు. ఈ విషయాల దృష్ట్యా పసివాళ్లు పయనించే బస్సులకు పసుపురంగు వేయాలని 1939లో ఉత్తర అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ ఫ్రాంక్ సైర్ ఒక సమావేశంలో వివరించారు. డాక్టర్‌సైర్ 'Father Of Yellow School Bus'గా ప్రసిద్ధిగాంచారు. స్కూలు బస్సులకు వేసే పసుపు రంగు సీసం కలిపిన క్రోమ్‌ఎల్లో.
- ప్రొ ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- ===========================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...