జవాబు: సుమతీ శతకంలో తేలు, పాములకు మాత్రమే విషమున్నట్లు ఉన్నా, మన జంతు ప్రపంచంలో చాలా జీవులకు విషం ఉంటుంది. కొన్ని వృక్ష జాతుల్లోనూ విషం ఉంటుంది. ప్రతీ జీవికి ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఉంటుంది. కొన్నింటికి కొమ్ములు, శరీరంపై ముళ్లు, పదునైన పళ్లు ఉంటే కొన్ని జీవుల శరీరాల్లో విషం ఉంటుంది. విషపు జంతువులు పనిగట్టుకుని ఎవరికీ హానీ చేయవు. ఆహార సముపార్జనకోసమో, లేదా ఎవరైనా హానీ తలపెట్టినపుడో విష జంతువులు తమను తాము రక్షించుకోవడానికి కుట్టడమో, కరవడమో చేస్తాయి.
పాములతోపాటు కొన్ని రకాలైన సముద్రపు నక్షత్రపు చేపలు, ఆక్టోపస్‌లు, చేపలు, కీటకాలు, సాలెపురుగులు, చీమలు, బల్లులు, గబ్బిలాలు కరిస్తే విషం సోకే ప్రమాదం ఉంది.
విషం కూడా ఓ విధమైన ప్రోటీనన్నమాట గుర్తుపెట్టుకోవాలి. కానీ అది మన శరీరంలో అవాంఛనీయ చర్యలతో కీడు కలిగిస్తుంది.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్,- శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- =======================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...