Monday, April 27, 2015

Petrole gives cool feeling on hands why?, పెట్రోల్‌ చేతిపై పడితే చల్లగా ఉంటుందెందుకు?

... 


ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !




ప్రశ్న: పెట్రోల్‌ చేతిపై పడితే చల్లగా ఉంటుందెందుకు?



జవాబు: పాత్రలలో ఉంచిన ద్రవ పదార్థాలేవైనా గాలిలో పెడితే కొంత కాలం తర్వాత వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి నిదానంగా ఆవిరయిపోతాయి. ఈ ప్రక్రియను భాష్పీభవనం (Evaporation) అంటారు. ఆవిరయ్యే ఉష్ణోగ్రతను భాష్పీభవన స్థానం అంటారు. ఆవిరవుతున్నపుడు ద్రవాల్లోని అణువులు వాటిని ఒకదానిలో మరొకటి బంధించి ఉన్న బంధాలను తెంచుకొని ఆవిరి రూపంలోకి మారి అవి ఉన్న పాత్రలలో నుంచి బయటి వాతావరణంలోకి వెళతాయి. ఇలా జరగడానికి ద్రవంలోని అణువులకు కావలసిన శక్తిని వాతావరణంలోని ఉష్ణం నుంచి గ్రహిస్తాయి. ఒక్కో ద్రవానికి ఒక్కో భాష్పీభవనస్థానం ఉంటుంది. పెట్రోల్‌ భాష్పీభవనస్థానం చాలా తక్కువ. అంటే పెట్రోల్‌, తక్కువ ఉష్ణోగ్రత వద్దే ఆవిరిగా మారుతుంది.

పెట్రోల్‌ మన చేతిపై పడినపుడు అది మన శరీరం నుంచి ఉష్ణం తీసుకొని తక్కువ ఉష్ణోగ్రత వద్దే ఆవిరయి పోవడంతో, అతి తక్కువ కాలంలోనే కొంత ఉష్ణాన్ని కోల్పోయిన మన శరీర భాగం అంటే చేయిపై చల్లగా ఉంటుంది. భాష్పీభవనం చల్లదానాన్ని కలుగచేస్తుంది.

  • ======================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...