Saturday, April 18, 2015

How can parrots talk like human?-చిలుకలు ఎలా మాట్లాడగలుగుతాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...







ప్రశ్న: చిలుకలు ఎలా మాట్లాడగలుగుతాయి?

జవాబు: చిలుకలు పలికే పలుకులు వాటి స్వర సంబంధిత అనుకరణ వల్లనే కానీ, వాటికి ఉండే ఏదో ప్రత్యేకమైన పదజాలం వల్ల మాత్రం కాదు. మానవుల, పక్షుల ప్రవర్తన చాలా వరకు గాత్రం వెలువరించే శబ్దాలు, దృష్టి సంకేతాలపై ఆధారపడి
ఉంటుంది.

పక్షుల స్వరపేటిక (voice box)ను సిరింక్స్‌ అంటారు. ఇది మానవుల స్వరపేటికలా కాకుండా అతి సామాన్యంగా ఉంటుంది. అందువల్ల అవి శబ్దాలను సులువుగా వెలువరించగలవు.
పక్షుల్లో స్వరపేటిక శ్వాసనాళం కింద ఉంటుంది. స్వరపేటికలో ఉత్పన్నమయిన శబ్ద తీవ్రతను శ్వాసనాళంలోని కండరాలు నియంత్రిస్తాయి. ఆ శబ్దాలు అంతగా హెచ్చుతగ్గులు లేని స్వరభేదంతో వాటి నోటి నుంచి వెలువడుతాయి.

చిలుకలు, మైనాలు వాగుడుకాయలు. ఇవి ఒక పర్యాయం 50 పదాల వరకు అనుకరణ రూపంలో శబ్దాలను వెలువరించగలవు. వీటిలో శబ్దాల విడుదలను నియంత్రించే మెదడు ముందు భాగం మగ పక్షులలో ఎక్కువ పరిమాణంలో ఉండటం వల్ల అవి శబ్దాలను సంగీత రూపంలో కూడా వెలువరిస్తాయి.

మానవులలో శబ్దాలు పక్షులలో వలె కాకుండా శ్వాసనాళంపై ఉండే స్వరపేటిక నుంచి వెలువడుతాయి. స్వరపేటిక వివిధ భాగాలతో సంక్లిష్టంగా నిర్మితమయి ఉండటంతో శబ్దాలు స్పష్టమైన మాటల రూపంలో వెలువడుతాయి. నాలుక, బుగ్గలు, నోరు, పెదాలు స్వరస్థానాలను తగురీతిలో మార్చడమే కాకుండా నియంత్రిస్తాయి.

ఆవిధంగా చిలుకలు మనం చేసే శబ్దాలను అనుకరిస్తాయే కానీ, అవి స్వతంత్రంగా తమకై తాము మాట్లాడలేవు. అందుకనే చిన్న పిల్లలు మనలను అనుకరిస్తూ నంగినంగిగా, ముద్దు ముద్దుగా మాట్లాడే ముద్దు మాటలను 'చిలక పలుకులు' అంటారు.

- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్‌


  • ============================

 visit My website > Dr.Seshagirirao - MBBS.- 

No comments:

Post a Comment

your comment is important to improve this blog...