- ======================
జవాబు: సౌర పవనాలు విద్యుదావేశంతో కూడిన పరమాణువుల ప్రవాహం. ఈ పవనాల్లో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, కొంత నిష్పత్తిలో బరువైన కేంద్రకాలు ఉంటాయి. ఇవి సూర్య వాతావరణంలో ఉండే అయస్కాంత క్షేత్రం నుంచి వెలువడుతాయి. సూర్యుని భాగమైన 'కరోనా'లోని అత్యధిక ఉష్ణం వల్ల ఉత్పన్నమయే అధిక పీడనం వల్ల అక్కడ నుంచి వెలుపలకు అంటే గ్రహాంతర ప్రదేశాల్లోని అన్ని దిశలకు ప్రవహించే గాలులే సౌర పవనాలు. సౌర పవనాలు 1,00,000 డిగ్రీల కెల్విన్ ఉష్ణోగ్రతతో సూర్యుని నుంచి సెకనుకు 500 కిలోమీటర్ల వేగంతో సూర్యుని క్రియాశీలతని బట్టి వెలువడుతాయి.
సౌర పవనాలలోని కణాలు భూమిని చేరుకోవడానికి 4, 5 రోజులు పడుతుంది. ఈ పవనాలను అధ్యయనం చేయడం ద్వారా సూర్యునిలో ఏర్పడే అరోరా, అయస్కాంత తుపాను లాంటి దృగ్విషయాలను శాస్త్రజ్ఞులు విశ్లేషించగలుగుతారు.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
No comments:
Post a Comment
your comment is important to improve this blog...