ప్రశ్న : పక్షులు ఒక ప్రాంతం నుంచి మరో చోటికి ఎలా వలస పోతాయి?
జవాబు : ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత కాలంలో పక్షులు ఒకే ప్రదేశానికి వలస పోవడానికి ఎన్నో కారణాలు దోహదపడతాయి. భూమిపై ఉండే నదులు, సముద్ర తీరాలు, పర్వత శ్రేణుల లాంటి భౌగోళిక పరిసరాలను అవి గుర్తు పెట్టుకోగలుగుతాయి. సముద్రాలను దాటి వలసపోయే ముందు పక్షులు సముద్ర తీరంలో ఒక నిర్ణీత ప్రాంతంలో గుమిగూడుతాయి. తర్వాత వాటి దృష్టి వ్యవస్థ ఆధారంగా సముద్రాలను దాటుతాయి. వాటి తలలో మాగ్నటైట్ అనే సూక్ష్మకణాలు అయస్కాంత సూచికలాగా పనిచేయడంతో ఆ ప్రభావం వల్ల భూ అయస్కాంత క్షేత్రాన్ని పసిగడుతూ, దానికి అనుగుణంగా దృష్టి వ్యవస్థను అనుసంధానించుకుని ముందుకు సాగుతాయి. ఆపై సూర్యుడు, నక్షత్రాలను గమనిస్తూ పక్షులు తాము వలసపోయే ప్రాంతానికి సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతాయి.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు, హైదరాబాద్
- =============================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...