ప్రశ్న: పేస్టులు, జెల్‌లు ఘన పదార్థాలా లేక ద్రవ పదార్థాలా?
జవాబు: నిర్ణీత ఆకారం, ఘన పరిమాణం ఉన్న వస్తువుల్ని ఘన పదార్థాలు అంటాము. నిర్ణీత ఘన పరిమాణం ఉన్నా నిర్దిష్ట రూపం లేకుండా ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని సంతరించుకునే వాటిని ద్రవ పదార్థాలు అంటారు. ఘన పరిమాణం, పీడనం పైన ఆధారపడ్డమే కాకుండా నిర్దిష్ట రూపం లేని పదార్థాల్ని వాయు పదార్థాలు అంటారు. ఘన, ద్రవ పదార్థాల్ని చూడగలం కానీ వాయు పదార్థాల్ని ప్రత్యక్షంగా చూడలేం. పేస్టు, జెల్ చూడ్డానికి ఘన పదార్థాల్లాగే అనిపించినా కొంచెం చిదిమితే రూపం మారిపోతుంది. ఈ లక్షణం ద్రవానిది కాబట్టి మీరు ప్రస్తావించిన పేస్టులు, జెల్‌లను అర్ధ ఘనపదార్థాలు (Semi solids) లేదా ఘన ద్రవాలు అంటారు. వీటినే కొల్లాయిడ్లు అంటారు. ఇందులో ద్రవం తక్కువగాను, ఘన పదార్థం ఎక్కువగాను ఉంటుంది. సాధారణంగా ద్రవ పదార్థం లోపల ఘన పదార్థాలు కరిగి ఉంటాయి. అందుకు విరుద్ధంగా జెల్‌లలో ఘన పదార్థాలలో ద్రవ పదార్థాలు కరిగి ఉంటాయి.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్;--కన్వీనర్, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- ===================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...