ప్రశ్న నాటిన అన్ని గింజలూ మొలకెత్తవు, ఎందుకు?
జవాబు: నాటిన గింజ మొలకెత్తాలంటే ఆ గింజలో ఫలజీవం సజావుగా ఉండాలి. సాధారణంగా పూర్తిస్థాయి క్రోమోజోములున్న సంయుక్త జీవ కణం (Zygote) విత్తనంలో ఉంటుంది. విత్తనం మొలకెత్తగానే కిరణజన్య సంయోగక్రియ జరపలేదు కాబట్టి సొంతంగా ఆహారం తయారు చేసుకునేంతవరకు తన ఎదుగుదలకు సహాయ పడేలా విత్తనంలో పోషణ ఉండాలి. అందుకే విత్తనాలలో సంయుక్త బీజకణ లక్షణాలతోపాటు పప్పు, కొబ్బరి, ముట్టె వంటి భాగాల్లో ఆహార పదార్థాలు ఉంటాయి. ఇవి క్షీణించి ఉన్నాగానీ, రసాయనిక కారణాల వల్లగానీ, జన్యులోపం వల్ల గానీ అధిక వేడివల్లగానీ తదితర కారణాల వల్ల విత్తనంలో ఉన్న జీవం నశించి ఉంటే అలాంటి విత్తనాలు మొలకెత్తవు.
అందుకే రైతులు విత్తనాల కోసం ప్రభుత్వాన్ని అర్థిస్తుంటారు. తాము పండించిన విత్తనాలు తిరిగి పంటకొచ్చే అవకాశం లేకపోవచ్చు లేదా, టెర్మినేటర్ సీడ్స్ అనే విత్తనాల్లో అన్నీ బాగున్నాగానీ, వీటి క్రోమోజోముల్లో కంపెనీల వాళ్లు కావాలనే జన్యు నిర్మాణం చేయడం వల్ల మొలకెత్తవు కాబట్టి జన్యులోపం లేకుండా, ఆహార సమృద్ధి బాగా ఉంటూ సజీవంతో ఉన్న విత్తనాలే మొలుస్తాయి. ఒక్కోసారి విత్తనాలు బాగున్నా నేలలో ఉండే సారం విత్తనం మొలకెత్తేందుకు అనువుగా లేకున్నా ఆ ప్రాంతాల్లో విత్తనాలు మొలకెత్తవు.
- ప్రొ|| ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; కన్వీనర్, శాస్త్రప్రచార విభాగం, జనవిజ్ఞానవేదిక (తెలంగాణ)
- =====================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...