జవాబు: నీటి ఉపరితలంపై గాలి బుడగలు లేక సబ్బునీటి బుడగలు ఒకదానికొకటి ఢీకొంటాయి. ఇలా నీటి కణాల మధ్య ఉత్పన్నమయ్యే ఆకర్షణకు కారణం తలతన్యత అనే భౌతిక ధర్మం. దీని ప్రకారం ద్రవాల ఉపరితలం స్థితిస్థాపకత కలిగి ఒక సాగదీసిన పొరలాగా ఉండి, అతి తక్కువ ఉపరితల వైశాల్యం కలిగి ఉండడానికి ప్రయత్నిస్తుంది. ఈ ధర్మమే నీటిలో విడివిడిగా ఏర్పడిన చిన్నచిన్న బుడగలను ఒక పెద్ద బుడగగా ఏర్పరుస్తుంది.
ఇచ్చిన ఘన పరిమాణానికి ఏర్పడే ఆకారంలో గోళానికి అతి తక్కువ ఉపరితల వైశాల్యం ఉంటుంది. కాబట్టి తలతన్యత వల్ల కలిసిపోయిన చిన్న బుడగలు ఒక పెద్ద బుడగగా ఏర్పడుతాయి. చిన్న బుడగల మధ్య దూరం తగ్గేకొద్దీ వాటి వేగం ఎక్కువవడానికి, అలా ఏర్పడిన పెద్ద బుడగలు పాత్ర గోడల వైపు వేగంగా పోవడానికి కారణం కూడా ఈ తలతన్యత వలన ఉత్పన్నమయ్యే బలమే.
ఈ ప్రక్రియ మూలాన్నే 10 నుంచి 15 మీటర్ల ఎత్తుండే చెట్లు కూడా భూమి లోపలి నీటిని తమ వేళ్లలో నుంచి వాటి కాండాల్లోని గుజ్జులో ఉండే అతి సూక్ష్మమైన మార్గాల ద్వారా పీల్చుకోగలుగుతున్నాయి.
- ఆర్. రమేష్, విజయనగరం
- ==================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...