ప్రశ్న: చంద్రగ్రహణం పౌర్ణమి రోజే ఏర్పడడానికి కారణం ఏమిటి?
జవాబు: భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతుంటే, ఆ భూమి చంద్రునితో సహా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఇలా తిరిగే భూమిపై సూర్యకాంతి నిరంతరం పడుతూనే ఉంటుంది. మరి సూర్యకాంతి పడినపుడు భూమి వెనక నీడ ఏర్పడుతుంది. కానీ అక్కడ అంతా అంతరిక్షం కాబట్టి ఆ నీడ కనపడదు. ఆ నీడపడే ప్రాంతంలోకి చంద్రుడు వచ్చాడనుకోండి. ఆ చంద్రుడే ఓ గోడలా ఉండటంతో భూమి నీడ దానిపై పడుతుంది. ఆ నీడ పరుచుకున్నంతమేర చంద్రుడు కనబడదు. కాబట్టి దాన్నే మనం 'చంద్రగ్రహణం' అంటాం. భూమి నీడలోకి రావడానికి ముందు చంద్రునిపై కూడా సూర్యకాంతి పడుతుంది. అంటే, భూమిపై నుంచి చంద్రుడు గుండ్రంగా, పూర్తిగా కనిపిస్తుంటాడు. అదే పౌర్ణమి. పౌర్ణమి నాడు చందమామగా కనిపిస్తున్నపుడే చంద్రుడు క్రమంగా భూమి నీడలోకి రాగలడు. అపుడే సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
- ప్రొ|| ఈ.వి.సుబ్బారావు,--హైదరాబాద్
- =========================
visit My website > Dr.Seshagirirao - MBBS.-
No comments:
Post a Comment
your comment is important to improve this blog...