Sunday, April 05, 2015

Lice on the head come from?- తలలో పేలు ఎక్కడినుండి వస్తాయి?

ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
  •  
  •  

ప్ర : Lice on the head come from?- తలలో పేలు ఎక్కడినుండి వస్తాయి?

జ : పేలు తలలో పుట్టవు . మాడును అంటిపెట్టుకుని , మాడును కుట్టి మనిషి రక్తాన్ని పీల్చే పేలు  తలనుండి బయటకి తీస్తే ఒకరోజు కనా ఎక్కువ బ్రతకలేవు . కాబట్టి ఎవరోఒకరి తలనుండు మరొకరి తల్కు వ్యాప్తిచెందాల్సిందే . ఒకరి తల మరొకరి తలకు తగిలినపుడు , ఒకరి దువ్వెన మరొకరు వాడినపుడు ,దిండు  ... దుప్పటికి అంటిపెట్టుకుని ఒకరి తల నుండి మరొకరి తలకు వస్తాయి. అప్పుడప్పుడు పేలు గాలి ద్వారా ఒకరి తలనుండి మరొకరి తలకు వ్యాప్తిచెందే అవకాశము లేకపోలేదు .. కాని చాలా అరుదుగా జరుగుతుంటుంది. అయితే పేలు ఎగరలేవు ఒకసారి తలలో చేరితే అతివేగముగా గుడ్లు పెట్టి వ్యాప్తిచెందగలిగిన పరాన్నజీవులు పేలు.
  • =======================
visit My website > Dr.Seshagirirao - MBBS.-

1 comment:

your comment is important to improve this blog...