Sunday, September 25, 2011

బట్టల బీరువాలో కలరా వుండలెందుకు ?,Why do we use Naphthalene balls in clothes shelf?


  • -



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !

ప్ర : బట్టల బీరువాలో కలరా వుండలెందుకు ?

జ : అల్మైరాలోని బట్టలు కంపుకొడుతున్నాయా? దీనికి కారణం అందులో చేరే బూజులు, పురుగులు కావచ్చు. బట్టలపై చేరే ఆ దుమ్ము, పురుగులు పోవాలంటే కొన్ని చిట్కాలు పాటించండి. చెక్క అల్మైరాలలో వుంచే బట్టలకు బూజులు, పురుగులు పట్టకుండా వుండాలంటే కలరా వుండలు (Naphthalene ) ఉంచుతారు . కలరా వుండలు సులభముగా ఆవిరి అయ్యే గుణము ఉంది . కర్పూరం (Camphor) : ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ వుండో ఒక ఘాటైన వాసన గల పదార్థము. ఇప్పుడు పెట్రోలియం ఉత్పత్తులనుండి తయారుచేసే నాఫ్తలిన్‌ బాల్స్ లోని రసాయనాలు గాలిలో వ్యాప్తిచెంది కీటకాలను , బూజు క్రిములను పారద్రోలుతాయి. క్యాంఫర్ బాల్స్ వాసనకి క్రిమి , కీటకాదులు బట్టలలో చేరవు . Naphthalene consists of two benzene rings fused together. Chemical formula: C10H8.

కర్పూరం (Camphor) :ఇది ఒక వృక్షం నుండి వస్తుంది , భారీ వృక్షము ఇది . స్పటిక సద్రుశమయిన తెల్లటి కర్పూరం .. చెట్టు కాండము , వేళ్ళు , చెక్కలు , ఆకులు , కొమ్మలు , విత్తనాలు నుండి లబిస్తుంది . దీని శాస్త్రీయ నామము " సిన్నమోమం కాంఫోరా ".
కృత్రిమం గా టర్పెంటైన్ ఆయిలు(Turpentine oil) నుండి కుడా కర్పూరం తాయారు చేస్తారు .

సంప్రదాయంగా హిందువులు పూజాది కార్యక్రమాలకు విధిగా వినియోగిస్తారు . వెలుగుతున్న కర్పూరం హారతికి భారతీయుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానం ఉన్నది . . . ప్రవిత్రం గా భావిస్తారు . కర్పూరం ఉండలు మండి పూర్తిగా కరిగిపోతాయి . కర్పూరం (C10H16O) ప్రగాఢమైన , తీక్షణమైన సువాసన వెదజల్లుతుంది .
  • ======================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...