ప్రశ్న: ఆసుపత్రులలో వాడే బట్టలు, తెరలు, తువ్వాళ్లు సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉంటాయెందుకు?
జవాబు: ఆకుపచ్చ రంగు క్షేమానికి, సస్యశ్యామలానికి గుర్తు. సాధారణంగా ఆసుపత్రులలో రక్తపు మరకలు అంటుకునే అవకాశాలు ఎక్కువ. వేరే రంగుల దుస్తులు వాడితే ఆ ఎరుపు రంగు మరింత ప్రస్ఫుటంగా కనిపించి రోగులను, వారి బంధువులను భయాందోళనలకు గురి చేసే అవకాశం ఉంది. ఆకుపచ్చ బట్టలపై రక్తం చిందినా అది ఎర్రగా కనిపించదు. నల్లగా కనిపించడం వల్ల ఎరుపు ప్రభావం కనబడదు. ఎందుకంటే ఆకుపచ్చ, ఎరుపు రంగులు పరస్పర విలోమ వర్ణాలు(mutually complementary colours). అంటే రెండూ కలిసినప్పుడు పరస్పరం శోషించుకుని నలుపు రంగులోకి మారతాయి. అందుకనే ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు, నర్సులు ఆకుపచ్చ బట్టలను కట్టుకుంటారు.
- ================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...