ప్రశ్న: తొక్కేప్పుడు సైకిల్‌ను బ్యాలన్స్ చేయగలం. కానీ అదే సైకిల్‌ను రెండు చక్రాల మీద నిలబెట్టలేం. ఎందుకని?
-కె. రాజగోపాలాచారి, తిరుపతి
జవాబు: కదలకుండా ఉండే వస్తువుపై పనిచేసేది గురుత్వాకర్షణ బలం ఒక్కటే. ఏదైనా వస్తువు స్థిరంగా ఉండాలంటే దాని గరిమనాభి (centre of Gravity)ని, భూమిని కలిపే సరళరేఖ ఆ వస్తువు ఆధారపీఠం పరిధిలోనే ఉండాలని మీరు పాఠాల్లో చదువుకుని ఉంటారు. వస్తువు ఆధార పీఠం వైశాల్యం ఎక్కువగా ఉన్న వస్తువులు స్థిరంగా నిలిచి ఉంటాయి. సైకిల్ విషయానికి వస్తే దాని ఆధార పీఠమంటే దాని రెండు చక్రాలే. ఆ చక్రాలను కలిపే సరళరేఖ చాలా సన్నగా ఉండడం వల్ల ఆ సైకిల్ గరిమనాభి స్థానం నుంచి భూమికి గీసే రేఖ ఆధారపీఠాన్ని దాటి పోతుంది. ఫలితంగా సైకిల్ ఒరిగి పడిపోతుంది. అయితే సైకిల్‌ను తొక్కేప్పుడు దానిపై గురుత్వాకర్షణ బలంతో పాటు మరిన్ని బలాలు పనిచేస్తాయి. తొక్కడానికి మనం ఉపయోగించే బలం దానిపై పనిచేసే గురుత్వాకర్షణ బలం కంటే ఎక్కువగా ఉండడంతో పాటు, అది పక్కకు ఒరిగేప్పుడల్లా మనం హేండిల్‌తో చక్రాలను తిప్పుతూ బ్యాలన్స్ చేయగలుగుతాం.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- ================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...