Sunday, September 04, 2011

ఎక్కువసేపు నవ్వితే చేతుల్లో నొప్పిపుడుతుందెందుకు?, Laugh for long time produce pain in shoulders-Why?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : ఎక్కువసేపు నవ్వితే చేతుల్లో నొప్పిపుడుతుందెందుకు?

జ : మానవ మొండెము మధ్యలో చాతి లోని గుండె , ఊపితిత్తులను ... పొట్ట భాగములోని జీర్ణాశయము , జీర్ణావయవాలను వేరుచేస్తూ " డయాప్రమ్‌ " అనే ఉదరవితానము (పొర ) ఉంటుంది . బాగా నవ్వినప్పుడు ఎక్కువగా గాలి లోపలికి ప్రవేశించి ఊపిరితిత్తులు పూర్తిగా నిండి డయాప్రమ్‌ పొరని కిందికి నెట్టుతాయి. . . అదే సమయములో ఉదర కండరములు సంకోచించడమువలన డయాప్రమ్‌ పైకి నెట్టబడుతుంది . ఇలా అనేక సార్లు నిరంతరము గా జరుగుతూ ఉంటే కండరముల ఈడ్పు (Strech) జరుగుతుంది .

ఉదర వితాతనము (డయాప్రమ్‌) తో సంబంధమున్న కండరము , భుజము (shoulder) కండరాలతో సంబంధము ఉన్నందున స్ట్రెచ్ తోపాటు ముఖ్యము గా కుడి చెయ్యికూడా నొప్పికి లోనవుతుంది . ఆనందముగా అలా నవ్వుతూ ఉంటే హార్ట్ ఎటాక్ నొప్పి ఏమోనని అనుమానము కలుగుతుంది . తక్కువగా గాలి పీల్చడమూ, నెమ్మదిగా శ్వాస క్రియ జరపడము , మరీ ఎక్కువగా తినకపోవడమూ వలన శరీరానికి మేలు జరుగుతుంది .

  • ===========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...