ప్ర : హిందూ పూజాకార్యాలలో ముందు కొబ్బరి కాయ ఎందుకు కొడతారు ?.
జ: మన కోర్కెలకోసం , సమస్యల నివారణకోసము గణేశుని ముందు ఒక కొబ్బరికాయ కొట్టి మన కోర్కెలను సఫలీకృతం చేయమని ప్రార్ధిస్తాము . ఇది తరతరాలుగా వస్తున్న ఆచారము . దాదాపు మన ఆచారాలు అన్నిటిలో శాస్త్రీయత దాగి ఉంది. కానీ ఒకప్పుడు ''ఈ పని చేస్తే, ఈ ప్రయోజనం కలుగుతుంది..'' అని చెప్పకుండా ''ఇలా చేయండి.. అలా చేయొద్దు'' అని మాత్రమే చెప్పేవారు. అదొక ఆచారంగా కొనసాగితేనే మంచిదని, ఉపయోగాలు ఉంటాయని చెప్తే ఎక్కువమంది బద్ధకిస్తారనేది పెద్దల ఉద్దేశం. అయితే, అలా శాసించడం వల్ల కొందరు వాటిని మూఢ నమ్మకాలు అని నిరసించడం జరుగుతోంది. ఆలోచించి చూస్తే, ప్రతి ఆచారం వెనుకా కారణం ఉంటుంది. దేవుడి పూజలో కొబ్బరికాయ కొట్టి, ఆ నీటితో దేవునికి అభిషేకం చేయడం వెనుక కూడా అర్ధం, పరమార్థం ఉన్నాయి.
దీనికో పురాణ కథ ఉన్నది . త్రినేత్రుడైన శివుడు ముగ్గురు రాక్షసుల్ని సంహరించాల్సి వచ్చింది . వారు " తామ్ర , లోహ , సువర్ణ " నగరాలలో నివసిస్తూ ప్రజల్ని పీడిస్తున్నారు . పరమేశ్వరుదు వారిని సంహరించడానికి వెళ్ళినపుడు ఆయనకు అనేక విఘ్నాలు ఎదురవుతాయి. అప్పుడు శివుడు ... విఘ్నాధిపతి అయిన తన కొడుకును ఆటంకాలనివృత్తికి తరుణోపాయము అడుగుతాడు . శివుని శిరస్సు నివేదంగా తనకు సమర్పిస్తే ఆటంకాలు తొలగిపోతాయని వినాయకుడు సూచిస్తాడు . అప్పుడు ప్రజలు యుక్తిగా శివుని తలకి బదులుగా మూడు కళ్ళున్న కొబ్బరికాయను కొట్టి వినాయకునికి సమర్పించారు . ఈశ్వరుడు అసురుపై యుద్ధము చేసి వారిని సంహరిస్తాడు . అప్పటినుండి నారికేళానికి పూజ్యత లభించినదని అంటారు . ఏ శుభకార్యానికైనా ఆరంభములో కొబ్బరికాయ కొట్టడం ఆచారమయినది .
- =====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...