ఫ్ర : కొంతమంది ఎప్పుడూ వణుకుతూ ఉంటారెందుకు?,Why do some shever always?
జ : మెదడులోని హైపోథాలమస్ శరీర ఉష్ణోగ్రతను క్రమపరుస్తూ ఉంటుంది . వాతావరణ పరిస్థితులను బట్టి మెదడు ప్రతిస్పందిస్తుంది . ఈ పక్రియ సాఫీగా జరిగేందుకు " ఐరన్ " ముఖ్య పాత్రవహిస్తుంది . ఎనీమియా ఉన్నవారిలో ఐరన్ తక్కువగా ఉంటుంది . . . కావున వారు చలికి వణుకుతూ ఉంటారు . రక్తప్రసరణ సరిగా జరగకపోవడం , థైరాయిడ్ గ్రంధిం శరీరములో జీవపక్రియల వేగాన్ని తగ్గించడం , కొన్ని జన్యుపరమైన కారణాల వలన చలికి తట్తుకునే పరిస్థితి కుంటుపడడం చేత వీరు వణుకుతూ ఉంటారు .
సాధారణ వయస్సు మీరటం, కదలికలకు సంబంధించి కొంత తగ్గుదల లేక మార్పులు వస్తాయి. వయస్సు మీరటం వల్ల మెదడు అర్ధగోళం ఘనపరిమాణం తగ్గటం, డోపమినిక్ ధర్మాలు లోపించటం వల్ల నాడీ మండలంలో మార్పులు వస్తాయి. దీని వల్ల వృద్ధుల్లో అసాధారణ లక్షణాలు గోచరిస్తాయి. ప్రతీ పనికీ ఎక్కువ సమయాన్ని తీసుకోవటం, నిలువుగా వున్న చూపులో అవరోధం, కండరాలు తగ్గిపోవటం, బిగువు ఎక్కువకావటం, ప్రేరకవేగం తక్కువ కావటం, ముందు వెనుకలకు తీవ్రంగా కంపించు శక్తి పాడవటం, స్థితిలో వుండలేకపోవటం, చిన్న చిన్న అడుగులేస్తూ నడకలో వేగం లేకపోవటం కలుగుతాయి. సహజంగా వయస్సు మీరటంలో ఇటువంటి మార్పులతో వృద్ధులో 'పార్కిన్‌సన్ వ్యాధి' వల్ల వస్తుంది. ఈ జబ్బువల్ల వృద్ధులు రెండు రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ధర్మాలలో ఎక్కువ చెరుపు, సాధారణ వయస్సు మీరటంలో కలవరం. కదలికల సమస్యలు రెండు రకాలు.... కదలికలు తగ్గి చలనంలేని బిగుతుగా వుండటం వంటి సమస్యలకు అద్దంపట్టే పార్కిన్‌సన్ వ్యాధి. ఎక్కువ చలనాలు గల అసంకల్పిత, మితిమీరిన కదలిక గల సమస్యలు
- ===================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...