పశ్న: టీవీని స్విచాఫ్ చేసిన వెంటనే మరలా స్విచాన్ చేయకూడదంటారు. ఎందుకని?
-ఎమ్. విష్ణుమూర్తి, , కమలాపురం
జవాబు: టీవీలో ఉండే ట్రాన్స్‌ఫార్మర్ పనితీరులో సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందువల్లనే, స్విచాఫ్ చేసిన వెంటనే తిరిగి స్విచాన్ చేయకూడదని చెబుతారు. టీవీ విద్యుదయస్కాంత ప్రభావంతో పని చేస్తుందని చదువుకుని ఉంటారు. టీవీని స్విచాఫ్ చేసినా ట్రాన్స్‌ఫార్మర్‌లో కొంత అయస్కాంత క్షేత్రం మిగిలి ఉంటుంది. ఈ సమయంలో వెంటనే స్విచాన్ చేస్తే విద్యుత్ ప్రసారం ఏర్పరిచే అయస్కాంత క్షేత్రం, ట్రాన్స్‌ఫార్మర్‌లో మిగిలి ఉన్న అయస్కాంత క్షేత్రంతో జోక్యం చేసుకుంటుంది. దీన్ని వ్యతికరణం అంటారు. అందువల్ల టీవీ సమర్థత, జీవితకాలం దెబ్బతినే అవకాశం ఉంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో మిగిలి ఉండే అయస్కాంత క్షేత్రం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి నాలుగైదు నిమిషాల తర్వాత స్విచాన్ చేయమని సూచిస్తారు.
- ================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...