ప్ర : రాత్రివేళ డ్రైవ్ చేస్తుంటే ఎదురుగా ఉన్న లైట్స్ చుట్టూ వలయాలేర్పడతాయెందుకు ? ,
జ : కను పాప ద్వారా కాంతికిరణాలు కంటిలో ప్రవేశిస్తాయి. పగటి వెలుతురులో కను పాప చిన్నదిగా అయి కాంతికిరణాలు లెన్స్ పై కేంద్రీకరింపజేస్తుంది . రాత్రి వెలుతురు తక్కువగా ఉండడము వలన కనుపాప మరింత పెద్దది అయి ఎక్కువ కాంతికిరణాలను లోనికి ప్రవేశ పెడుతుంది . అందువలన కంటిలోని లెన్స్ పై ఎక్కువమేర కాంతికిరణాలు పడతాయి మరియు ఒకచోట కేంద్రీకరింపబడవు . లెన్స్ గుండ్రముగా ఉండడము వలన గుండ్రని వలయాలుగా కనిపిస్తాయి.
రాత్రి , పగలు అన్నివేళలా ఇలాగే కనిపిస్తూ వుంటే క్యాటరాక్ట్ వచ్చే సూచనగా పరిగణించాలి .
- ===================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...