ప్ర : కొంతమందికి సూదులతో గుచ్చినట్లు ఉంటుందెందుకు?
జ : దీనిని పారస్థీసియా అంటారు . ఇది ఒక అసాధారణమైన ఇంద్రియ జ్ఞానము . ఈ లక్షణము కలవారికి శరీరము పై గుండు సూదులు గుచ్చినట్లు , గిలిగింతలు పెట్టినట్లు ఉంటుంది . ఒక నాడిని అదిమి పట్ట్టడము ద్వారా లేక ఒత్తిడివల్ల దానికి రక్తప్రసరణ సరిగా జరగదు . కొంతసేపు కదలకుండా కూర్చుంటే తిమ్మిరెక్కుతుంది . . కాని పారస్తీసియాలో ఎక్కువకాలము నరాలపై ఒత్తిడి కలగడం , దెబ్బ తగలడం వల్ల ఆయా శరీర భాగాలలో వాపు కలగడం కొన్ని కారణాలుగా చెప్తారు . ఆయా శరీర భాగాలనుంది నొప్పికి సంబంధించిన జ్ఞానము మెదడుకు పంపే ప్రక్రియ లో భాగము గా సూదులు గుచ్చినట్లు అనిపిస్తుంది .
కారణాలు : ల్యూపస్ , మల్టిపుల్ స్క్లిరోసిస్ , డయబిటీస్ మున్నగునవి .
- =========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...