Friday, September 23, 2011

సముద్రం నీలమేల?,Why do Sea appears blue?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.


ప్రశ్న: సముద్రపు నీరు నీలం రంగులో కనిపిస్తుంది, ఎందుకు?



జవాబు: ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. సూర్యుని కాంతి ప్రధానంగా ఏడు రంగుల మిశ్రమమని చదువుకుని ఉంటారు. ఈ కాంతి సముద్రంపై పడినప్పుడు నీటి అణువులు ఆ కాంతిని వెదజల్లుతాయి. దీన్నే పరిక్షేపం (స్కాటరింగ్‌) అంటారు. ఇలా వెదజల్లేప్పుడు సూర్యకాంతిలోని ఇతర రంగుల కన్నా నీలం రంగు ఎక్కువగా పరిక్షేపమవుతుందనేది స్థూలంగా చెప్పే కారణం. రసాయనిక బంధాల పరంగా చూస్తే నీరు దృశ్యకాంతిని శోషించుకోలేదు. అందుకనే సాధారణ నీరు వర్ణరహితంగా, పారదర్శకంగా (colourless, transparent) ఉంటుంది. నీటి అణువులు కాంతిని శోషించుకోలేవు కాబట్టే వెదజల్లుతాయి. ఆ ప్రక్రియలో అధికంగా నీలం రంగునే వెదజల్లుతాయి. మన కన్ను సూటిగా వెళ్లే కాంతి కన్నా అన్ని వైపులకూ వెదజల్లిన కాంతిని ఎక్కువగా గుర్తించగలుగుతుంది. అలాగే నీలంగా కనిపించే ఆకాశాన్ని నీరు ఒక అద్దంలా ప్రతిబింబించడం కూడా సముద్రపు నీలం రంగుకు ఒక కారణమని కూడా చెప్పవచ్చు.

-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్‌, వరంగల్‌; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానకేంద్రము .
  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...