ప్రశ్న: కొన్ని చెట్లను నరికినా తిరిగి చిగురువేసి జీవిస్తాయి. కానీ కొబ్బరి, తాటి, ఈతవంటి చెట్లను నరికితే మరణిస్తాయి. ఎందువల్ల?
-బి. రామకృష్ణ, 5వ తరగతి, మదర్ థెరిసా పాఠశాల, గుబ్బగుర్తి (ఖమ్మం)
జవాబు: జీవుల జీవన విధానాన్ని వాటి జన్యు నిర్మాణం (జెనెటిక్స్) నిర్ణయిస్తుంది. మొక్కల్లో వివిధ రకాల కుటుంబాలు, జాతులు ఉన్నాయి. కొబ్బరి, తాటి, ఈత వంటి చెట్లు ఏకదళ బీజ (monocotyledons)మొక్కలు. ద్విదళ బీజ మొక్కల్లోనే నరికినా చిగురించే లక్షణం ఉంటుంది. ఒక మొక్క లేదా జీవిలో కొంత భాగాన్ని కత్తిరించినా తిరిగి ఎదగాలంటే ఆయా భాగాల్లో స్టెమ్ సెల్స్ ఉండాలి. వీటి ఆధారంగానే నరికిన చెట్టు చిగురిస్తుంది. దీన్నే పునరుత్పత్తి (regeneration) అంటారు. తాటి, ఈత, కొబ్బరి వంటి మొక్కల కాండాల్లో ఈ కణాలు ఉండవు. కేవలం వృక్ష అగ్ర భాగంలోనే ఉంటాయి. కానీ మర్రి, జామ, వేప వంటి చెట్ల కాండాల్లో స్టెమ్‌సెల్స్ ఉంటాయి. వీటిలో కూడా తిరిగి చిగురించడం వాటి కాండాన్ని నరికిన ప్రదేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది.
-ప్రొ||ఎ. రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటీ, జనవిజ్ఞానవేదిక
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...