ప్రశ్న: రాత్రి వేళల్లో మొక్కలు ఏం చేస్తుంటాయి?
-ఎ. హరిప్రియ, 8వ తరగతి, నూజివీడు
జవాబు: రాత్రివేళల్లో మొక్కల్లో చాలా వరకు పూలు ముడుచుకుని పోయినా అవి విశ్రాంతి తీసుకోవు సరికదా, వాటిలోని జీవ ప్రక్రియ (metabolism) చాలా తీవ్ర స్థాయిలో జరుగుతూ ఉంటుంది. రాత్రి వేళల్లో మొక్కలు కోల్పోయే నీటి పరిమాణం చాలా తక్కువ కావడంతో, అవి వాటి ఆకుల అడుగు భాగంలో ఉండే సన్నని రంధ్రాలను (stomata) విశాలంగా తెరుచుకునేటట్లు చేసి వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ను ఎక్కువగా శోషించుకుంటాయి. తెల్లవారిన తరువాత చీకటి ఉండగానే తొలి సూర్యకిరణాల సాయంతో కిరణజన్య సంయోగ క్రియను ప్రారంభించడానికి సర్వ సిద్ధంగా ఉంటాయి.
-ప్రొ||ఈ.వి. సుబ్బారావు, హైదరాబాద్
- =====================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...