Thursday, March 10, 2011

గడ్డం-గత వైభవం ఏమిటి?, What was Beard importance in history?






--ప్రాచీన కాలపు బాబిలోన్‌లో గడ్డాలకు గొప్ప గౌరవం ఉండేది. నిజం చెప్పాలంటే అన్ని ప్రమాణాలూ గడ్డం సాక్షిగా జరిగేవి. మనిషి గడ్డాన్ని పట్టుకోవడం అన్నది క్రీ.పూ. 2వ సహస్రాబ్దిలో సన్నిహిత స్నేహానికి గుర్తుగా పరిగణించే వారు. గడ్డాన్ని పట్టుకొని లాగడం అన్నది మొరటైన పనిగా మాత్రం కాదు అతి అవమానకరమైన పనిగా గుర్తింపబడేది. కొంత మంది గడ్డాన్ని వివేకపు చిహ్నం గా పరిగణిస్తారు. ప్రాచీన కాలపు ఈజిప్టువారి సంఘంలో గడ్డం ఒక హోదాను సూచించేది. గడ్డం ఎంత పొడవుగా ఉంటే వారు అంత గొప్ప హోదాకలవారిగా గుర్తింపబడేవారు.

ఎక్కడ వారి గడ్డాలలో ఒకే ఒక వ్యత్యాసం ఉండేది. క్రీ.పూ. 3000 సంవత్సరాల క్రితం ఉన్న ఈజిప్టువారు కృత్రిమ గడ్డాలను ధరించేవారు. అలెగ్జాండర్‌ (క్రీ.పూ.356-323) తన సైనికులకు గడ్డం పెంచేందుకు అనుమతి ఇవ్వలేదు. గడ్డాలు కొంతమంది ముఖానికి అందాన్ని చేకూరుస్తున్నాయి. అప్పుడప్పుడు గడ్డాలు మనిషి ముఖంపై ఉన్న మచ్చలనూ, దెబ్బల గుర్తును కప్పిపుచ్చుకునేందుకు కూడా ఉపయోగపడుతాయి. తన ముఖంపై ఉన్న గాయపు మచ్చలను కప్పిపుచ్చుకోడానికి రోమన్‌ చక్రవర్తి హాడ్రియన్‌ (క్రీ.శ.117-138) గడ్డాన్ని పెంచాడు. అది ఒక ఫ్యాషన్‌గా తయారయ్యింది. గడ్డాలను పెంచుకోవడం అన్నది 400 సంవత్సరాల తరువాత తిరిగి ప్రారంభమయ్యింది. దీనికి ముందు ఉత్తమ తరగతి రోమన్లు తమ బానిసలకు శుభ్రంగా క్షవరం చేయించేవారు. ప్రాచీన కాలపు గ్రీకులలో మగవారు గడ్డాలు క్షవరం చేయించుకోవడానికి మంగలి షాపులకు వెళ్లేవారు. ఇలా క్షవరం చేయించుకోవడం వల్ల మంగలి వారి ఆదాయం విపరీతంగా పెరిగిపోయింది.

ప్రాచీన కాలపు గ్రీకులలో మొదటిసారి పెరిగిన గడ్డాన్ని ఆనవాయితీ ప్రకారం అపోలో దేవతకు సమర్పించుకునేవారు. అపోలో దేవుడు సూర్యరశ్మి, సంగీతం, కవిత్వానికి సంబంధించిన దేవుడిగా ఉండేవాడు. రోమ్‌లో కూడా ఇలాంటి ఆనవాయితీ ఉండేది. ప్రాచీన కాలంలో ప్రజలు వెంట్రుకలను జీవితంగా, జీవితపు శక్తిగా పరిగణించారు. 6వ ఎడ్వర్డ్‌ చక్రవర్తి (1547-1553) కాలంలో ఇంగ్లాండులోని సామాన్యులకు గడ్డం పెంచుకునే అధికారం ఉండేదికాదు. వారు 3 వారాల గడ్డాన్ని మాత్రం కలిగి ఉండవచ్చు. అంతకు మించి కాదు. కొంతమంది రాజులు పెంచిన గడ్డాలపై సుంకం విధించి తద్వారా దేశ ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచేందుకు కష్టపడ్డారు.

-1558లో మొదటి క్వీన్‌ ఎలి జబెత్‌ గడ్డాలపై సుంకాన్ని విధించింది. ఇది చాలా అప్రతిష్టపాలు కావడంతో ఆపై సంవత్సరం ఇది వాపసు తీసుకోబడింది. మొదటి ఎలిజబెత్‌ రాణి చేసిన నేరాన్నే రష్యా దేశపు చక్రవర్తి పీటర్‌ చేశాడు. 1968లో గడ్డం పెంచుకున్న వారిపై 100 రూబుల్స్‌ పన్ను విధించాడు. ఆ రోజుల్లో గడ్డం పెంచుకునేందుకు లైసెన్స్‌ పొందవలసి వుండేది. ఒక రాతి తట్ట రూపంలో సుంకం కట్టాల్సి వచ్చింది. లైసెన్స్‌ను పొందకుండా గడ్డం పెంచడం అన్నది ఒక నేరంగా ఒక అపరాధంగా పరిగణించబడేది. మొగలాయి చక్రవర్తులలో చక్రవర్తి అయిన ఔరంగజేబు (1618-1707)కు గడ్డాల వెర్రి కాస్త ఉండేది. గడ్డం అన్నది నిజంగానే వివేకానికి చిహ్నం అని రష్యా దేశపు చక్రవర్తి పీటర్‌ ది గ్రేట్‌ (1682- 1725) భావించాడు. గడ్డం నున్నగా గీయించుకున్న రాజదూత తన పరి చయ పత్రాన్ని సమర్పించడానికి వస్తే దాన్ని స్వీకరించడానికి రష్యా దేశపు పీటర్‌ నిరాక రించాడు. గడ్డం పెంచడం ద్వారా అబ్రహాం లింకన్‌ ప్రత్యేకమైన సౌందర్యాన్ని పొందాడు.
  • ====================================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...