Friday, March 04, 2011

రాత్రులు హాయిగా నిద్ర పోవడం ఎలా?, How to get good sleep at night?


ప్ర :
రాత్రి హాయిగా నిద్ర పోవాలంటే ఏమి చేయాలి?.

జ : నిద్ర లేదా నిదుర (Sleep) ఒక శరీరానికి సంబంధించిన విశ్రాంతి స్థితి. ఇది జంతువులలోనే కాకుండా పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు మరియు చేపలలో కూడా కనిపిస్తుంది. మనుషులు, ఇతర జంతువులలో దైనందిక నిద్ర బ్రతకడానికి అవసరం. 8 గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో శరీర సామర్ధ్యం తగ్గినట్లుగా గుర్తించారు. అయితే నిద్ర యొక్క ప్రాముఖ్యత గురించి ఇంకా పూర్తిగా అర్ధం కాలేదు. విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నాయి. గాలి ,నీరు , ఆహారము లాగే నిద్ర కూడా ఒక సహజ శారీరక అవసరము . ఎవరెన్ని గంటలు నిద్రపోవాలన్న అంశం పైన భిన్నాబిప్రాయాలు ఉన్నా వేళకు తిని , వేళకు పడుకుంటే ఆరోగ్యాము నిక్షిప్తం గా ఉంటుంది . అలసిన మనసుకు , తనువుకు నిద్ర ఒక వరము .

మంచి నిద్ర రావడానికి ఈ క్రింది చూచనలు పాటించాలి :
  • * రాత్రి 9 గంటలు దాటిన తరువాత ఆల్కహాలు తీసుకోడదు . ఆల్కహాలు మధ్యలో నిద్రను చెడగొడుతుంది .
  • * రాత్రి 7 గంటలు తరువాత తీ , కాఫీ , కెఫీన్ ఉన్న పానీయాలు తీసుకోకూడదు ,
  • * రాత్రి ఆలస్యము (చాలా పొద్దుపోయిన తర్వాత) గా ఆహారం తినకూడదు.
  • * రాత్రులు ఎక్కువగా ఆహారము (full meal) తినకూడదు ,డిన్నర్‌లో తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలి.
  • * పడుకునే ముందు వ్యాయామము చేయకూడదు ,
  • * పడక గదిని ... పనిచేసే ఆఫీస్ గది గా మార్చకూడదు ,
  • * పడుకునే ముందు వేడిపాలు తాగితే మంచి నిద్ర వస్తుంది .
  • పదుకునే సమయానికి గంట ముందు టెలివిజన్‌ ఆపెయ్యాలి -టి.వి , కంప్యూటర్ లో వచ్చే వెలుగు , రంగులు కళ్ళను , మెదడును ఇబ్బంది పెడతాయి , మెదడు ఉత్తేజ పడడం , ఎడ్రినల్ హార్మోను ఉప్ప్తత్తి దీనికి కారణము ,
  • * నిద్ర రానపుడు ఏదైనా మంచి పుస్తమును చదవాలి - సెక్ష్ నవలలు , డిటెక్తివ్ పుస్తకాలు చదువరాదు .. ఇవి మెదడును ఉత్తేజపరచి ఎడ్రినాలిన్‌ , నార్ ఎడ్రినాలిన్‌ ఉప్పత్తి అయి నిద్ర రానివ్వవు ,
  • * నిద్రపోయేముందు వేడినీళ్ళ స్నానము చేస్తే మంచి నిద్ర పడుతుంది ,
  • * సుఖ నిద్ర పోవటానికి ఆహారం, పానీయాలు తోడ్పడతాయి . మంచి ఆహారం, సుఖనిద్ర ఆరోగ్యానికి చాలా అవసరం.
  • * శరీరంలో షుగర్‌ సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి. బ్లడ్‌షుగర్‌ తక్కువగా ఉన్నట్లయితే నిద్రపట్టదు. కలత నిద్ర కలుగుతుంది.
  • * ఆహారం తీసుకున్న వెంటనే మత్తుగా అనిపించి కునుకు పట్టొచ్చు. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రపోవటం ఆరోగ్యకరం కాదు కొంతసేపటికి నిద్రా భంగం కలిగి, తర్వాత నిద్ర పట్టకపోవచ్చు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం తర్వాతనే పడకచేరాలి.
  • * పడక చేరబోయేముందు ఎక్కువ నీరు తాగకూడదు.
  • * మూత్ర విసర్జన చేసి పడకచేరాలి.

  • ====================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...