- -
- దగ్గు మందు ------------------------------దగ్గు .
ప్ర : ప్రతి ఒక్కరూ ఎదో ఒక సందర్భములో దగ్గుతారు ఎందుకు?
జ : పలు సందర్భాలలో దగ్గుతో భాద పడడం మన అందరికీ అనుభవమే. దీనికి కారణము గొంతులో గాని , వాయునాళములో గాని చేరిన సూక్ష్మక్రిములు , సూక్ష్మపదార్ధములు , కఫమును బయటకు పంపేందుకు శరీరం చేసే ప్రయత్నమే దగ్గు . దగ్గినపుడు ఊపిరితిత్తుల్లోని గాలి వేగంగా బయటకు వస్తుంది . దీని వల్ల ఏర్పడే ఒత్తిడి గొంతు , శ్వాసనాళాల్లోని పదార్ధములను బయటకు పంపుతుంది . కావున శ్వాసనాళాల్లోని , ఊపిరిత్తులల్లోని కఫాన్ని క్లియర్ చేసేందుకే దగ్గు వస్తుంది .
మన డయాప్రమ్ బలముగా సంకోచము (Diaphrgm ) చెందడము , ప్రక్కటెముకలు మధ్యఉన్న కండరాలు(inter costal muscles) ఒక్కసారిగా సంకోచము అవడం మూలాన ఈ పక్రియ జరుగుతూ ఉంటుంది .
- ==================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...