Sunday, March 13, 2011

ధ్వజస్తంభము లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశములో ఎందుకు కాపురముండకూడదు ?



ప్ర : ధ్వజస్తంభము లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశములో ఎందుకు కాపురముండకూడదు ?

జ : ధ్వజస్తంభము లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశము నకు సూర్యరశ్మి సరిగా పడాల్సినంత పడదు . తగినంత సూర్యరశ్మి లేనిచో అనారోగ్యా నికి గురికావచ్చును. నీడ పడిన ప్రదేశము పరమాత్మ ఆవహించిన ప్రదేశము అంటే .. ఆలయము లో జరిగే గుడి గంటల శబ్దాలు(శబ్దకాలుష్యము) , దూపదీపాలనుండి వచ్చే పొగ(వాయుకాలుష్యము) , రోజూ గుడికొచ్చే భక్తుల రద్దీ , వారి ఉశ్వాస -నిశ్వాసానుండి వెలువడే సూక్ష్మక్రిముల దాడి(వైరల్ ఇన్‌ఫెక్షన్‌) నుండి మానవ ఆరోగ్యము పాడయ్యే అవకాశము ఉన్నందున కనీసము గోపురం నీడ పడిన దూరము వరకైనా నివాసము కూడదని ఈ ఆద్యాత్మిక నియమనిబందనలు పెట్టేరు మన పూర్వీకులు. తాను ఉన్న ప్రదేశములో ప్రజల అనారోగ్యము స్వామికి ఎంతమాత్రము ఇస్టముండదు కదా... అని సర్ది చెప్పినట్లు భావించాలి .

  • ==========================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...