ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.
ప్ర : పాలు ఎలా పెరుగు అవుతుంది ?
జ : ఇది ఒక రకమైన సూక్ష్మజీవులు చర్య . పాలలోని కెసిన్(Casin) అనే ప్రోటీన్ తో లాక్టోబాసిల్లస్ (Lactobacillus) అనే బ్యాక్టీరియా జరిపే చర్య . ఈ బ్యాక్టీరియా ఉప్తత్తిచేసే ఆమ్లము - లాక్టిక్ ఆమలము లోని హైడ్రోజన్ అయాన్లు జరిపే చర్య తో పాలు అలా బిగుసుకొని పెరుగు అవుతాయి. ఇలా పెరుగు అవ్వాలంటే పాలను కొద్దిగా వేడి చేయాలి . మరీ వేడి పాలలో తోడు వేస్తే బ్యాక్టీరియాలు చనిపోతాయి.
- ======================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...