Wednesday, March 16, 2011

సముద్రపు నీటిలో బంగారం కరిగి ఉందా?,Gold is disloved in Sea water.Is it ?



ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుసాహము కనబరుస్తారు . చిన్న విషయమైనా , అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !.

ప్రశ్న : సముద్రపు నీటిలో బంగారం కరిగి ఉంటుందట!.నిజమేనా?,Gold is disloved in Sea water.Is it true?

జవాబు: అవును.నిజమే.సముద్రాపు నీటిలో ప్రతి 10 ఘనపు కిలోమీటర్ నీటిలో 1 కిలో బంగారం కరిగి ఉంటుంది.భూమి మీద ఉన్న మొత్తం సముద్రపు నీటి నుండి బంగారాన్ని వేరు చేస్తే ఆ వచ్చే బంగారం ఎంత ఉంటుందో తెలుసా !ప్రపంచ జనాభా అందరికి ఒక్కొక్కరికి 10 కిలొల బంగారం ఇవ్వవచ్చు.ఐతే సముద్రపు నీటి నుండి బంగారాన్ని తయారు చేయడం అంత తేలికైన పని కాదు.ఎందుకంటే అంత నీటి నుండి దాన్ని రసాయన ప్రక్రియ ద్వారా వేరు చేయడమంటే దానికి చాలా వ్యయం అవుతుంది.అంటే 1 కిలో బంగారం కావాలంటె దానికి ఖర్చు కొట్ల రూపాయలలో ఉంటుంది.
  • =================================
visit My website > Dr.Seshagirirao - MBBS.

No comments:

Post a Comment

your comment is important to improve this blog...