మానవుడు జీవితంలో వేటిని ప్రార్ధిస్తాడో వాటిని పురుషార్ధములు అంటారు. ప్రతివాడు కొన్ని కోరికలు కోరతాడు. అంటే ఒక లిస్ట్ ఇస్తాడు. ఎంత లిస్ట్ ఇచ్చినా సరే మొత్తం లిస్టంతా కాటగరైజ్ చేస్తే అవి అన్నీ సంపదలకి సంబంధించిన కోరికలు కొన్ని,సుఖాలకి సంబంధించినవి కొన్ని, వీటికి సాధనగా మంచి పనిచెయ్యాలి అనేటటువంటివి కొన్ని. తెలివి పెరిగిన కొద్దీ నేను శాశ్వతమైన సుఖంలో వుండిపోవాలి అనేటటువంటి కోరిక కొంత. ఈ రకంగా మన కోరికలు నాలుగు రకాలుగా విభాగం చేసినప్పుడు
ధర్మ సంబంధమైన కోరికలు కొన్ని--ధర్మము ,
అర్ధ సంబంధమైన కోరికలు కొన్ని--అర్ధము ,
కామ సంబంధమైన కోరికలు కొన్ని--కామము ,
మోక్ష సంబంధమైన కోరికలు కొన్ని--మోక్షము , ఉంటాయి... ఇవన్నీ పురుషుడు అర్ధించేవి కనుక పురుషార్ధములు.
- ===========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...