హార్లిక్స్‌ను కనిపెట్టింది ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళ పేర్లు విలియం హార్లిక్స్, జేమ్స్ హార్లిక్స్. విలియం పెద్దవాడు. జేమ్స్ చిన్నవాడు. వీళ్ళది ఇంగ్లాండ్. కానీ పని వెతుక్కుంటూ అమెరికా వెళ్ళారు. ఇద్దరూ ఆహారపదార్థాల తయారీలో ప్రయోగాలు చేసేవారే. 1873 ప్రాంతంలో విలియం హార్లిక్స్ చంటిపాపల కోసం హార్లిక్స్ ను తయారుచేశాడు. అప్పట్లో వాళ్ళూ దానికి మాలెడ్ మిల్క్ అనే పేరు పెట్టారు. వేడి నీళ్ళలో ఈ పొడి కలుపుకొని తాగితే బాగుంటుంది. అని ప్రచారం చేశారు. ఆ ప్రచారం, హార్లిక్స్ రుచి అందరికీ నచ్చింది. అన్నదమ్ములు వెంటనే చికాగోలో ఫ్యాక్టరీ స్థాపించారు. 1908లో అమెరికా నుంచి తిరిగి స్వదేశానికి చేరుకొని హార్లిక్స్ వ్యాపారాన్ని మొదలెట్టారు. పసిపిల్లలే కాదు పర్వతారోహకులు కూడా హార్లిక్స్ తమ వెంట ఉంచుకొని దానికి ప్రచారం కల్పించడంతో హార్లిక్స్ అమ్మకాలు ఊపందుకున్నాయి. 1960లో హార్లిక్స్ పంజాబ్‌లో ఫ్యాక్టరీ పెట్టడం ద్వారా భారత్‌లో ఉత్పత్తి ప్రారంభించింది. ప్రస్తుతం ప్రపంచంలో హార్లిక్స్ అత్యధికంగా అమ్ముడు పోయేది ఇంగ్లాండ్, ఇండియా.
- ==============================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...