ప్రశ్న: వాహనాల నెంబర్లు ఎప్పుడూ నాలుగేసి అంకెలతోనే ఉంటాయెందుకు? అంతకంటే ఎక్కువ అంకెలతో ఉండవేం?
జవాబు: వాహనాల రిజిస్ట్రేషన్‌ను నాలుగంకెలతో చేయడం ఒక ఆనవాయితీ (convention). అలాగే ఉండాలనడానికి విజ్ఞాన శాస్త్రపరమైన నియమం లేదు. గుర్తుపెట్టుకోడానికి సులువుగా ఉండడం కోసమే ఇలా చేస్తారు. అలా అయితే ఒక అంకె సరిపోతుంది కదా అనుకోకండి. ఎందుకంటే అలాంటప్పుడు ప్రతి 10 వాహనాల తర్వాత a,b,c,dలను ఆ అంకెలకు కలపాల్సి వస్తుంది. నాలుగు అంకెలతో నెంబర్లు ఉండడం వల్ల ప్రతి 10,000 వాహనాలకి ఓసారి అక్షరాలను జత చేసి ఇచ్చే వీలు ఉంటుంది. అయిదు లేదా ఆరు అంకెల సంఖ్యతో వాహనాలకు నెంబర్లు ఇస్తే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వాటిని గుర్తు పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక వాహనందారుడు ప్రమాదకరమైన వేగంతో వెళ్లేప్పుడు, ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిపోతున్నప్పుడు దాన్ని ట్రాఫిక్ పోలీసులు చటుక్కున చూసి నెంబరును నోట్ చేసుకోవలసి వస్తుంది. అలాగే దుండగులు కిడ్నాప్ లాంటి నేరాలకు పాల్పడి వాహనాల్లో పారిపోయే సందర్భాల్లో ప్రత్యక్ష సాక్షులైన సామాన్యులు కూడా గుర్తు పెట్టుకోలేకపోతారు. ఈ కారణాల రీత్యా వాహనాల నెంబర్లకు నాలుగంకెలనే కేటాయించడం కొనసాగుతోంది.
- ===========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...