ప్రశ్న: ఆసుపత్రులు, అంబులెన్స్‌లు, వైద్యుల కార్లపై ఎర్రని ప్లస్ (+) గుర్తు ఉంటుంది కదా? దాని అర్థమేంటి?
జవాబు: తెల్లని నేపథ్యంలో ఎర్రని ప్లస్ గుర్తు ఉంటే అది అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సంస్థ చిహ్నం. కొందరు ప్లస్ చుట్టూ గుండ్రని వలయం గీస్తారు. అప్పుడది రెడ్‌క్రాస్ చిహ్నం కాదు. నాలుగుసార్లు నోబెల్ శాంతి బహుమతి పొందిన రెడ్‌క్రాస్ సంస్థ, స్విట్జర్లాండ్ దేశస్థుడైన హెన్రీ డునాంట్ యుద్ధ సైనికులకు చికిత్స చేసే విధానాలపై రాసిన పుస్తకం ప్రేరణగా కొందరు 1863లో జెనీవాలో స్థాపించినది. అప్పట్లో తరచూ జరిగే యుద్ధాల్లో గాయపడిన సైనికులకు సేవచేసే వారిని గుర్తించి, ఎవరూ దాడి చేయకుండా ఉండడానికి ఈ చిహ్నం ఉపయోగపడేది. అదే నేడు ఆరోగ్య రంగానికి చిహ్నంగా మారింది. వాస్తవానికి చట్టపరంగా రెడ్‌క్రాస్ సంస్థకు చెందని వారు ఈ చిహ్నాన్ని వాడకూడదు.
- =========================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...