ప్రశ్న: కుళాయి నుంచి నీరు పడేప్పుడు పైనుంచి కిందకి వచ్చేకొద్దీ ధార సన్న బడుతుందేం?
జవాబు: కుళాయి నుంచి నీటి ధార పడుతున్నప్పుడు అది ముందు లావుగా ఉండి, రాన్రానూ సన్నబడుతూ త్రిభుజాకారంలో పడుతుంది. ఒక భౌతిక సూత్రం ప్రకారం నిలకడగా నిరంతరంగా నీరు పడుతున్నప్పుడు ఆ ప్రవాహంలో ఏ రెండు సమాన భాగాలను (cross section) తీసుకుని పరిశీలించినా వాటిలోని నీటి ఘనపరిమాణం సమానంగా ఒకే విలువ కలిగి స్థిరంగా ఉండాలి. కానీ కుళాయి నుంచి నీరు కిందకి పడేకొలదీ, భూమ్యాకర్షణ శక్తి వల్ల నీటి వేగం ఎక్కువవుతూ ఉంటుంది. అందువల్ల ఆ ధారలో ఒక భాగం నుంచి మరో భాగానికి వెళుతున్న కొద్దీ ఒక సెకనుకు ఎక్కువ నీరు ప్రవహించే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఆయా భాగాల్లో నీటి ఘనపరిమాణం సమానంగా ఉండాల్సి ఉంది కాబట్టి, నీరు కిందకి పడుతున్న కొలదీ అడ్డుకోత వైశాల్యం తగ్గుతుంది. అందువల్లనే మొదట్లో లావుగా ఉండే నీటి ధార కిందకి వచ్చేసరికి సన్నబడుతుంది.
- ==============================================
No comments:
Post a Comment
your comment is important to improve this blog...